పీఎం వ‌స్తే అన్ని కోట్లు ఖ‌ర్చు చేయాలా ?

Update: 2022-06-22 08:17 GMT
దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. ఆయ‌న వివాదంలో చిక్కుకున్నారు అనే క‌న్నా బెంగ‌ళూరు అధికారులే ఇందుకు కార‌ణం అయ్యారు అని చెప్ప‌డ‌మే మేలు. అస‌లు ప్రొటొకాల్ ప్ర‌కారం ఇన్ని కోట్లు వెచ్చించ‌డం వెనుక అస‌లు ఉద్దేశం ఏంటి అని ఓ సందేహం ఇటీవ‌ల ప్ర‌ధాని ప‌ర్యట‌న సంద‌ర్భంగా వినిపిస్తోంది.

రెండు రోజుల ఖర్చు కోట్ల‌లో ఉంటే సామాన్యుడి గ‌తి ఏం కావాలి అని విప‌క్షం యుద్ధం చేస్తోంది. కేవ‌లం రోడ్ల‌కూ ఇత‌ర ప‌నుల‌కూ ఊహించ‌ని మొత్తాలు ఖ‌ర్చు పెట్టి ప్ర‌జా ధ‌నం ఎలా వృథా చేస్తార‌ని బొమ్మై స‌ర్కారుకు బొమ్మ చూపిస్తోంది విప‌క్ష కాంగ్రెస్ నాయ‌కుల‌తో స‌హా, ఇత‌ర పార్టీల నేత‌లు కూడా !

రెండ్రోజుల క‌ర్ణాటక ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కి స్వాగత మ‌ర్యాద‌లు చాలా బాగానే జ‌రిగాయి.ఇందుకు భారీ మొత్తంలో ఖ‌ర్చు చేశార‌ని తెలుస్తోంది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఇక్క‌డికి అంటే బెంగ‌ళూరుకు చేరుకున్నాక, ఐటీ హ‌బ్ లో నిర్వ‌హించిన ప‌లు స‌మావేశాల్లో పాల్గొన్నారు.

అయితే ప్ర‌ధాని రాక నేప‌థ్యంలో ఎంత ఖ‌ర్చ‌యింది? అన్న వివ‌రం ఒక‌టి చెప్పాల‌ని ఓ  ఔత్సాహికుడు స‌మాచార హ‌క్కు చ‌ట్టం (ఆర్డీఏ ) ద్వారా అర్జీ పెట్టుకున్నాడు. దీనిపై బృహ‌త్ బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర పాలిక (బీబీఎంపీ) స్పందించింది. ప్ర‌ధాని రాక నేప‌థ్యంలో 23 కోట్లు ఖ‌ర్చు అయ్యాయ‌ని తెలిపింది.

ఇందులో  ఎల‌హంక ఎయిర్ పోర్టు నుంచి బెంగ‌ళూరుకు చేరుకునే క్ర‌మంలో ప్ర‌ధాని ప్ర‌యాణించే మార్గం అంతా కొత్త రోడ్లు వేయ‌డానికే 14 కోట్లు ఖర్చు అయ్యాయ‌ని తెలిపింది.

అదేవిధంగా వీధి దీపాలు, కాలువ మ‌ర‌మ్మ‌తుల‌కు మిగిలిన మొత్తాల‌ను ఖ‌ర్చు చేశామ‌ని వివ‌రించింది. ఇంత‌మొత్తంలో నిధులు ఖ ర్చు చేయాల్సి రావ‌డం ఎందుక‌ని విప‌క్ష స‌భ్యులు అధికార పార్టీని నిల‌దీస్తున్నారు.
Tags:    

Similar News