కొత్త సంవత్సరం వేడుకలపై కర్ణాటక సర్కార్ ఆంక్షలు !

Update: 2020-12-18 12:30 GMT
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కర్ణాటక లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరోనా ఉధృతం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగుళూరు సిటీ తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిషేధాజ్ఞలు అమలవుతుందని, ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న బహిరంగ ప్రదేశాలు, షాపింగ్ మాల్స్ లాంటి చోట్ల ఎటువంటి ప్రత్యేక వేడుకులను చేపట్టరాదని స్పష్టం చేసింది. ఈ నిషేధం డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకూ అమల్లో ఉంటుందని పేర్కొంది.

అయితే..క్లబ్‌లు, రెస్టారెంట్లు, పబ్‌లు ఎప్పటిలాగే సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా, కొత్త సంవత్సరం, క్రిస్మస్ పండుగల్లో ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న సామూహిక కార్యక్రమాలను నిషేధించడమైనది అంటూ చీఫ్ సెక్రెటరీ పేరిట ఆదేశాలు విడుదలయ్యాయి. తొలినాళ్లలో తక్కువ కేసులున్న కర్ణాటకలో రానురాను వైరస్ వ్యాప్తి ఉధృతంగా కొనసాగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.3కోట్లకుపైగా టెస్టులు నిర్వహించగా, మొత్తం కేసులు 9.05లక్షలు వచ్చాయి. కర్ణాటకలో కరోనా మరణాల సంఖ్య 12వేలుగా ఉంది. ఇప్పటికే 8.78లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇకపోతే , కరోనా దేశంలో ఇంకా పూర్తిగా కంట్రోల్ లోకి రాని నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇదే ధోరణి లో ఆంక్షలు విధించే అవకాశం ఉంది.
Tags:    

Similar News