ఉమెన్స్ గ్రాండ్ స్లామ్ డబుల్స్ చాంపియన్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాకు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. తనకు అన్ని అర్హతలున్నప్పటికీ సానియా మీర్జాకు ‘రాజీవ్ గాంధీ ఖేల్ రత్న’ అవార్డును ఇవ్వడం సరికాదని పేర్కొంటూ పారా ఒలింపియన్ 2013లో పద్మశ్రీ పురస్కార గ్రహీత గిరీషా ఎన్ గౌడ కర్నాటక హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు అవార్డు బహుకరణపై స్టే విధిస్తూ కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇచ్చింది.
కర్నాటకకు చెందిన గిరీషా 1012లో సమ్మర్ పారా ఒలింపిక్స్ లో హైజంప్ రజత పతకాన్ని సాధించాడు. పారా ఒలింపిక్స్ మెడల్ సాధించిన 9వ క్రీడాకారుడిగా గిరీషా నిలిచాడు. రజత పతకం సాధించిన మూడో క్రీడాకారుడిగా రికార్డుకెక్కాడు. తనను కాదని సానియాకు ఖేల్ రత్న ప్రకటించడాన్ని కోర్టులో గిరీషా సవాల్ చేశారు. దీంతో ఈ పిటిషన్ ను విచారిస్తూ హైకోర్టు సానియాకు ప్రకటించిన అవార్డుపై సమీక్షించాలని కోరింది.
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29న బహుకరిస్తారు. అవార్డు బహుకరణకు రెండ్రోజులు ముందు జరిగిన ఈ పరిణామం సానియాకు ఇబ్బందికరమే. ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.