బలవంతపు శృంగారంపై హైకోర్టు సంచలన తీర్పు!

Update: 2022-11-05 11:50 GMT
బలవంతపు శృంగారానికి సంబంధించి కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వ్యభిచార గృహంలో మైనర్‌ బాలిక తనతో బలవంతపు శృంగారం చేశారని ఎవరిపైన అయినా ఫిర్యాదు చేస్తే అతడిని కస్టమర్‌గా పరిగణనలోకి తీసుకోకూడదని కర్ణాటక హైకోర్టు పేర్కొంది.

కేసు పూర్తి వివరాల్లోకెళ్తే.. కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన మహ్మద్‌ షరీఫ్‌ అకా ఫహీమ్‌ హాజీ (45) మంగళూరులోని ఓ వ్యభిచార గృహంలో శృంగారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ మహ్మద్‌ షరీఫ్‌ కర్నాటక హైకోర్టులో అతడు పిటిషన్‌ దాఖలు చేశాడు.

పోలీసులు దాడులు చేసిన సమయంలో పట్టుబడ్డవారిని కస్టమర్‌లుగా పరిగణించవచ్చు అని ధర్మాసనం పేర్కొంది. అయితే శృంగారం చేసింది మైనర్‌ బాలికతో అయి ఉండి.. అతడిపై ఫిర్యాదు చేసి ఉంటే అతడిని కస్టమర్‌గా పరిగణించలేమని తేల్చిచెప్పింది.  

పిటిషనర్‌ షరీఫ్‌ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది... నిందితుడు వ్యభిచార గృహానికి వెళ్తే అతడిపై మానవ అక్రమ రవాణా కింద కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. దొరికింది ఒక కేసులో అయితే అనేక రకాల కేసులు తన క్లయింట్‌పై నమోదు చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు.  అందువల్ల షరీఫ్‌పై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరారు.

అయితే ఇందుకు కోర్టు అంగీకరించలేదు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి 17 ఏళ్ల బాలిక తన బంధువు వద్ద ఉంటూ చదువుకుంటోంది. ఆమెకు సహాయం చేస్తానని నమ్మబలికిన నిందితుడు షరీఫ్‌ ఆ బాలికను వ్యభిచార గృహానికి అమ్మేశాడు. అంతేకాకుండా కస్టమర్లతో ఉన్న సమయంలో ఆమె వీడియోలు తీశాడు.

ఇక ఆ వీడియోలను చూపిస్తూ బాధితురాలిని బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. తాను చెప్పినట్టు వినకపోతే సోషల్‌ మీడియాలో వీడియో పెడతానని బెదిరించాడు. దీంతో బాలిక భయపడింది. దీన్ని అలుసుగా తీసుకుని పలుమార్లు ఆ బాలికపై అత్యాచారం చేశాడు. చివరకు వ్యభిచార గృహం నుంచి తప్పించుకుని తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు మహ్మద్‌ షరీఫ్‌ పై పోక్సో చట్టంతో పాటు పలు చట్టాల కింద కేసు నమోదు చేశారు. దీన్ని విచారించిన కోర్టు బాధితురాలు ఒకరే అయినప్పటికీ ఆమెపై పాల్పడిన నేరాలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయని అభిప్రాయపడింది. అన్ని కేసులను ఒకే కేసుగా పరిగణించాలని డిమాండ్‌ చేయడం సాధ్యం కాదని నిందితుడు తరఫు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News