ట్రంప్ భార్యను చూసి కక్కుర్తిపడిన కర్ణాటక మంత్రి

Update: 2016-11-16 09:58 GMT
కర్ణాటక విద్యాశాఖ మంత్రి తన్వీర్ సేఠ్ ఘనకార్యాల గురించి మర్చిపోలేదు కదా.... ఈమధ్య ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుండగానే ఆయన తన స్మార్టు ఫోన్లో బూతుబొమ్మలు చూస్తూ అడ్డంగా బుక్కయిన ఘనుడాయన. ఇంతకీ తన్వీర్ తనివితీరా లొట్టలేసుకుంటూ చూసిన ఆ ఫొటోలు ఎవరివో తెలుసా... అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియావట. ఆమె ఒంటిపై నూలుపోగు లేకుండా దిగిన ఫొటోలను చూసి తన్వీర్ దొరికిపోయారు. అయితే... ఆమె ఒంపుసొంపులే ఇప్పుడాయన పదవికి ఎసరు తెచ్చేలా ఉన్నాయి.

మెలానియా ట్రంప్ కు భార్య కాకముందు చాలాకాలం మోడల్ గా పనిచేసింది. అప్పట్లో ఆమె ఫుల్ హాట్ బేబీ. ఎన్నో యాంగిల్సులో ఎడాపెడా ఫొటో షూట్ లు చేయించుకుంది. అందులో న్యూడ్ ఫొటోలూ ఉన్నాయి. వాటినే చూస్తూ తన్వీర్ ఎంజాయ్ చేశారు. ఇది కాస్తా మీడియా కెమెరా కంట పడటంతో, ఆయనపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన రాజీనామా చేయాలంటూ బీజేపీ - జేడీఎస్ పార్టీలు డిమాండ్ చేశాయి.

మరోవైపు.. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వరలు కూడా తన్వీర్ సేఠ్ కు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి ట్రంప్ కంటే ముందే ఆయన భార్య భారత రాజకీయాలను ప్రభావితం చేస్తోందన్నమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News