కర్నాటకలో సంకీర్ణ సంక్షోభం....!?

Update: 2018-09-11 14:43 GMT
కర్నాటకలో రాజకీయాలు మంచి రసకందాయంలో పడ్డాయి. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు - మంత్రి అయిన రమేష్ జారకిహోళి తన సోదరుడుతో పాటు మరో కొంతమంది కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరానున్నారని వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఈ వార్త తెలిసిన వెంటనే కర్నాటకలోని జేడీఎస్ ప్రభుత్వం ఖంగు తింది. తమ పార్టీలో చేరాడానికి భారతీయ జనతా పార్టీ - కాంగ్రెస్ నాయకులకు మధ్య ఒప్పందం కుదిరిందని కర్నాటకలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ - రమేష్ జారకిహోళితో రహస్యంగా భేటీ అయ్యారని సమాచారం. అయితే ఈ విషయానికి సంబంధించి వారివురు కూడా స్పష్టత ఇవ్వలేదు. కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఆ ప్రభుత్వాని ఇరుకున పెట్టాలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అక్కడ అధికారంలో ఉన్న జేడీఎస్ - కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి బోటా బోటి మెజారిటీ ఉండడంతో ఈ తిప్పలు తప్పటం లేదు.

ఒకవేళ అన్నీ అనుకూలించి కుమారస్వామి ప్రభుత్వం కుప్ప కూలి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సాయంతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే పదవుల పందారంపై కూడా అప్పుడే చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌ బై చెప్పి - భారతీయ జనతా పార్టీకి హయ్ చెప్తే ఆరు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లపై పార్టీ అధిష్టానంతో చర్చిస్తామని భారతీయ జనతా పార్టీ నాయకులు కొందరు కాంగ్రెస్ తిరుగుబాటు నాయకులకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.  బిజేపీకి మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామ చేసి ఎన్నికలలో పాటీ చేస్తే దానికయ్యే ఖర్చంతా భారతీయ జనతా పార్టీ భరించాలనే షరతులు కూడా విధించినట్లు చెబుతున్నారు. కర్నాటకలో నెలకొన్న అనిశ్చితి గందరగోళ రాజకీయాలతో కన్నడీగులు మాత్రం హైరాన పడుతున్నారు.

Tags:    

Similar News