నాయకులు.. నాయకులు తిట్టుకున్నారంటే.. అర్థం ఉంది. లేదా.. ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకున్నారంటే.. సరేలే అని అనుకోవచ్చు. కానీ.. ప్రజలపై.. నాయకులు చేయి విదిలిస్తే.. తమ సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చిన వారిపై విరుచుకుపడి.. చేయి చేసుకుంటే.. పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదే జరిగింది కర్ణాటకలో తనకు ప్రభుత్వం భూమి కేటాయిస్తానని హామీ ఇచ్చిందని.. కానీ, ఇవ్వలేదని.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను కర్ణాటకలోని ఓ మంత్రి చెంపపై లాగిపెట్టి కొట్టాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే.. అంతా అయిపోయిన.. తర్వాత మంత్రి క్షమాపణలు చెప్పి.. కేసునుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
కర్ణాటకలోని చామరాజ్ నగర్ జిల్లా హంగాల గ్రామంలో చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర మౌలిక వనరుల అభివృద్ధి శాఖ మంత్రి వి. సోమన్న హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుమారు 175 మందికి గ్రామీణ ప్రాంతాల్లో భూ క్రమబద్దీకరణకు ఉద్దేశించిన సెక్షన్ 94సీ ప్రకారం టైటిల్ డీడ్‌లను పంపిణీ చేశారు. అయితే.. ఈ క్రమంలో దరఖాస్తు చేసుకున్న ఓ మహిళకు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ పట్టాను ఇవ్వలేదు. ఈ విషయమై వాగ్వాదానికి దిగిన మహిళను మంత్రి చెంప దెబ్బకొట్టారు. అయినా.. సదరు మహిళ మంత్రి కాళ్లకు దణ్నం పెట్టి తన గోడును వెళ్లబోసుకొంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
తనకు ప్రభుత్వమే పట్టా ఇస్తానని చెప్పిందని.. ఇవ్వకపోగా.. అన్యాయం చేస్తున్నారని.. సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తన ముగ్గురు పిల్లలతో మంత్రి వద్దకు వచ్చింది. తనకు భర్త లేడని.. తనకు న్యాయం చేయాలని.. బోరుబోరున విలపించింది. అయితే.. మంత్రి మాత్రం రౌడీ మాదిరిగా రెచ్చిపోయి.. మహిళపై చేయి చేసుకున్నాడు. ఇదిలావుంటే.. కర్ణాటకలో బీజేపీ నేతలు.. మంత్రులు.. దురుసుగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. గతేడాది డిసెంబర్‌లో న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి ఓ మహిళా రైతును తిట్టారు. గత నెలలో బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి ఓ మహిళను తిట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఇక, ఇప్పుడు.. మంత్రి ఓ మహిళను చాచి పెట్టి కొట్టాడు. ఇదీ.. బీజేపీ పాలన అంటున్నారు నెటిజన్లు.
Full View