నాడు హంత‌కుడు...నేడు వైద్యుడు!

Update: 2020-02-15 17:20 GMT
బుద్ధిగా చ‌దువుకుని త‌న బంగారు భ‌విష్య‌త్తుకు బాట‌లు వేయాల‌నుకునే ఓ యువ విద్యార్థి....అనుకోని ప‌రిస్థితుల వ‌ల్ల ఓ కేసులో జైలుకు వెళ‌తాడు....చ‌దువుకోవాలన్న ఆ విద్యార్థి త‌ప‌న‌ను గుర్తించిన జైలు అధికారులు, న్యాయ నిపుణులు....ఆ యువ‌కుడికి కాలేజీకి వెళ్లి చ‌దువుకునేందుకు అనుమ‌తిస్తారు.....ఆ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్న ఆ యువ‌కుడు...చివ‌ర‌కు త‌న జైలు శిక్ష‌ను పూర్తి చేసుకొని లాయ‌ర్ అవుతాడు....టాలీవుడ్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ కు స్టార్డ‌మ్ తెచ్చిన స్టూడెంట్ నంబ‌ర్ వ‌న్ సినిమా ప్లాట్ ఇది. ఇటువంటి ఘ‌ట‌నలు కేవ‌లం సినిమాల‌కే ప‌రిమితం కాదు. నిజ‌జీవితంలోనూ జ‌రుగుతాయ‌ని ప‌లుమార్లు నిరూపిత‌మైంది. తాజాగా ఇదే త‌ర‌హాలో క‌ర్ణాట‌క కు చెందిన ఓ వ్య‌క్తి జైలు శిక్ష‌ను అనుభవించిన త‌ర్వాత డాక్ట‌ర్ అయిన ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.


కర్ణాటకలోని కాలబుర్గి ప్రాంతానికి చెందిన సుభాష్ పాటిల్ 1997లో ఎంబీబీఎస్ లో చేరాడు. విద్యార్థి ద‌శ‌లో ప‌ద్మావ‌తి అనే మ‌హిళ‌ తో ఏర్ప‌డిన వివాహేత‌ర సంబంధం అత‌డి జీవితాన్ని మ‌లుపు తిప్పింది. ఆ మ‌హిళ భ‌ర్త‌ను క్ష‌ణికావేశంలో హ‌త్య చేసిన సుభాష్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. 2016లో శిక్ష అనుభ‌వించి విడుదలైన సుభాష్‌...మంచి మ‌నిషిగా మారాడు. డాక్ట‌ర్ కావాల‌న్న త‌న క‌ల‌ను నెర‌వేర్చుకోవాల‌నుకున్నాడు. తాను చ‌దివిన యూనివ‌ర్సిటీ అధికారుల స‌హ‌కారం, న్యాయ నిపుణుల సూచ‌న‌ల‌తో గ‌త ఏడాది ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఇటీవలే ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేసుకున్న సుభాష్‌....వైద్యుడిగా ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని, త‌న త‌ప్పుకు ప్రాయ‌శ్చిత్తం చేసుకోవాల‌ని ఆతృత‌గా ఎదురుచూస్తున్నాడు. క్ష‌ణికావేశంలో చేసిన త‌ప్పుకు జైలుశిక్ష అనువించిన సుభాష్...స‌ద్భుద్ధితో వైద్యుడిగా మార‌డం ఎంద‌రికో ఆద‌ర్శ‌ప్రాయమ‌ని చెప్ప‌వ‌చ్చు.


Tags:    

Similar News