తనకేమాత్రం సంబంధం లేకున్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట పడనున్నారా? అంటే అవుననే చెప్పాలి. తమ చుట్టుపక్కల రాష్ట్రాలతో స్నేహంగా ఉంటామని తరచూ చెప్పే కేసీఆర్ కు మాటలకు భిన్నంగా ఆయనపై కన్నడిగులు గుస్సా ప్రదర్శిస్తారా? అన్న సందేహాలు కలిగేలా ఆ రాష్ట్రంలోని పరిణామాలు ఉన్నాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న ధరలకు తగ్గట్లుగా తమ జీతాలు లేవంటూ కర్ణాటక ఎమ్మెల్యేలు తమ జీతాలు పెంచాలంటూ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. కర్ణాటక ఎమ్మెల్యేలు జీతాలు పెంచమంటే.. కన్నడిగులు కేసీఆర్ మీద గుస్సా ప్రదర్శించాల్సిన అవసరం ఏముందన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. అక్కడే అసలు పాయింట్ ఉంది.
కర్ణాటక స్పీకర్ కు వినతిపత్రం ఇచ్చిన కర్ణాటక ఎమ్మెల్యేలు.. తమ జీతాల పెంపునకు ఉదాహరణలు ప్రస్తావిస్తూ.. అందులో తెలంగాణ రాష్ట్రం పేరును ప్రస్తావించారు. కర్ణాటకకు పొరుగున ఉన్న తెలంగాణలో ఎమ్మెల్యే జీతాలు రూ.2.2లక్షలు ఉన్నాయని.. ఢిల్లీ ఎమ్మెల్యేలకు అయితే రూ.2.10లక్షలు అందుకుంటున్నారని.. వీరితో పోలిస్తే తమకు వస్తున్న రూ.1.40లక్షలు జీతం ఏ మూలకు సరిపోవటం లేదని వాపోయారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2015లోనే కర్ణాటక ఎమ్మెల్యేల జీతాలు పెంచారు. అప్పట్లో వారికి రూ.95వేలు ఉండేది. దీని మీద 40 శాతం పెంపుతో వారి జీతం రూ.1.40లక్షలకు చేరుకుంది. తాజాగా మరో 25 శాతం జీతాన్ని పెంచాలని వారు కోరుతున్నారు. వారు కోరుకున్నట్లే జీతం పెరిగిన పక్షంలో ఒక్కో ఎమ్మెల్యే జీతం రూ.1.75లక్షలుగా మారనుంది.
జీతాల పెంపు మీద కర్ణాటక ఎమ్మెల్యేల వాదన చూస్తే.. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తొలుత గుర్తుకు వచ్చేది ఎమ్మెల్యేనేని.. పెళ్లిళ్ల దగ్గర నుంచి చావుల వరకూ ప్రతి నెలా సాయం కోసం వచ్చి డబ్బులు అడిగే వారు ఉంటారని.. అలాంటి సర్దుబాట్ల కోసమైనా జీతం పెరగాల్సిన అవసరం ఉందంటూ తమ వేదనను చెప్పుకున్నారు. తమ బతుకుల్లోమార్పు లేకున్నా.. ఏడాదికేడాది జీతాలు పెంచాలంటూ కర్ణాటక ఎమ్మెల్యేలు కోరటంపై కన్నడిగులు కోపంగా ఉన్నారు.
ప్రజల బతుకుల్ని మార్చేస్తామని.. ప్రజాసేవ చేస్తామని రాజకీయాల్లోకి వచ్చే రాజకీయ నాయకులు జీతాల కోసం ఇంతగా పాకులాడటం ఏమిటన్న విమర్శ వినిపిస్తోంది. జీతాలు పెంచాలంటూ స్పీకర్ కు కర్ణాటక ఎమ్మెల్యేలు వినతి పత్రం ఇవ్వటంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు మరోమారు స్పందించారు. తాముజీతాలు పెంచమని కోరలేదని.. పక్కనున్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలకు ఇస్తున్న జీతాలు చూడమని మాత్రమే చెప్పామని చెబుతున్నారు. ఇదే కన్నడిగులకు కేసీఆర్ పై ఆగ్రహాన్ని కలిగించే అంశంగా చెప్పొచ్చు. ఎమ్మెల్యే జీతాల పెంపునకు అద్యుడిగా కేసీఆర్ మారి.. అందరికి స్ఫూర్తినివ్వటం.. ఎమ్మెల్యేల జీతాల పెంపును వ్యతిరేకిస్తున్న వారు కేసీఆర్ ను కోపగించుకోవటంలో ఆశ్చర్యమేముంది?