ఆశీర్వ‌దిస్తాను.. గ‌దిలోకి రండి.. త‌ర్వాత ఆ స్వామీజీ ఏం చేసేవారంటే!

Update: 2022-08-28 01:30 GMT
కర్ణాటకకు చెందిన ఓ మఠంలోని స్వామీజీ తమను వేధిస్తున్నాడని కొంత మంది విద్యార్థినులు ఆరోపించారు. ``ఆశీర్వ‌దిస్తాను.. గ‌దిలోకి రండి..`` అని పిలిచి.. త‌మ‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని స్వామీజీపై నిప్పులు చెరిగారు.  మైసూరులోని ఒడనడి సేవా ట్రస్ట్ ఆఫ్ విమెన్ కంఫర్ట్, చిల్డ్రన్ రెసిడెన్సియల్ సెంటర్లో బాధితులు ఫిర్యాదు చేశారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన స్వామీజీ.. ఆయ‌నే చెందిన‌ మఠం నిర్వహిస్తున్న హాస్టల్లో చదువుకుంటున్న వారిని లైంగికంగా వేధించాడు.

ప్రతి వారం స్వామీజీ విద్యార్థులను ``ఆశీర్వ‌దిస్తాను`` అంటూ తన గదికి పిలిచి లైంగికంగా వేధించేవాడు. దీనిని కొంద‌రు విద్యార్థినులు ప్రశ్నించినందుకు వార్డెన్, ఇతర సిబ్బంది కూడా వారిని వేధించేవారు. ``ఈ మఠం మాకు ఉచితంగా హాస్టల్ వసతి కల్పిస్తోంది.

అయితే, మమ్మల్ని వారానికి ఒకసారి స్వామీజీ తన గదికి పిలిచేవాడు. ఆశీర్వాదాల పేరుతో మమ్మల్ని లైంగికంగా వేధించేవాడు. దీనిపై మేము ప్రశ్నించినందుకు, వార్డెన్ ఇతర పనివాళ్లు కూడా మమ్మల్ని వేధింపులకు గురిచేశారు`` అని బాధిత విద్యార్థినులు క‌న్నీరు పెట్టుకున్నా.

ప్రశ్నించిన బాధితులను హాస్టల్ సిబ్బంది బయటకు గెంటేశారు. దీంతో స్టూడెంట్స్ తమ ఇంటికి వెళ్లకుండా బెంగుళూరులోని బంధువుల వద్దకు వెళ్లారు. అయితే వాళ్లు వెళ్లే సమయంలో ఆటో డ్రైవర్కు జరిగిన విషయం చెప్పారు. అనంతరం ఆటో డ్రైవర్ వారిని కాటన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు.

పోలీసులు స్టూడెంట్స్ను ఇంటికి పంపించారు. విషయం తెలుసుకున్న బాధితుల తల్లిదండ్రులు, ఓ లోకల్ ప్రజా ప్రతినిధి వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం ఆ ప్రజా ప్రతినిధి.. ఎన్జీఓ వద్దకు వారిని పంపించారు. అంతేకాదు.. ఈ కేసు పోక్సో చట్టం కిందకు వస్తుందని పేర్కొన్నారు. బాధితులు తమ వద్దకు వచ్చిన వెంటనే వివరాలు తెలుసుకుని, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వద్దకు పంపించామని తెలిపారు.
Tags:    

Similar News