అక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపితమైన దివంగత అమ్మ.. అన్నాడీఎంకే చీఫ్ జయలలితకు విధించిన రూ.100కోట్ల జరిమానాను వసూలు చేసుకునే పనిలో పడింది కర్ణాటక ప్రభుత్వం. అమ్మ మరణం నేపథ్యంలో అక్రమాస్తుల కేసులో ఆమెకు విధించిన జైలుశిక్ష అమలు సాధ్యం కాని వేళలో.. ఆమెకు విధించిన జరిమానాను వసూలు చేసే దిశగా అడుగులుపడ్డాయి.
గతంలో అమ్మ జయలలితకు విధించిన జరిమానాను సుప్రీంకోర్టు రద్దు చేయటంతో.. ఆ తీర్పును పున:సమీక్షించాలని కర్ణాటక సర్కారు కోరుతోంది. ఏదైనా కేసులో శిక్ష పడినప్పుడు దానిపై అప్పీలు చేసినా.. నిందితులు జరిమానా చెల్లించటం.. జైలుశిక్ష విధించటం లాంటి విషయాల్లో మినహాయింపులు.. రద్దులు చెల్లవన్న వాదనకు తెర తీసిన కర్ణాటక సర్కారు.. తాజాగా సుప్రీంలో ఒక పిటీషన్ ను దాఖలు చేసింది.
జయలలితకు విధించిన రూ.100కోట్ల జరిమానాను ఎట్టిపరిస్థితుల్లోనూ వసూలు చేయాలన్న పట్టుదలతో ఉన్న కర్ణాటక ప్రభుత్వ తీరుపై కోర్టు స్పందన ఎలా ఉన్నా.. తామెంతో అభిమానించే అమ్మ వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వ తీరును మాత్రం తమిళులు మండిపడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. కర్ణాటక పిటీషన్ పై సుప్రీం ఎలారియాక్ట్ అవుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/