బంగారం లాంటి అమ్మాయి. ఎలాంటి కంప్లైంట్లు ఉండవు. అందరితో కలుపుగోలుగా ఉంటుంది. చురుగ్గా ఉంటుంది. అందంగా ఉంటుంది. అన్నింటికి మించి బాగా చదువుకుంటుంది. అలాంటి అమ్మాయికి ఉన్న ఏకైక పిచ్చ టిక్ టాక్. ఇప్పుడా పిచ్చే ఆ అమ్మాయి ప్రాణాల్ని తీసింది. సోషల్ మీడియాకు బానిసలుగా మారితే ఎలాంటి ఉపద్రవాలు మీదకు వస్తాయో చెప్పే ఉదంతంగా దీన్ని చెప్పాలి. తాజాగా టిక్ టాక్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న కోలార్ చెందిన యువతి విషాదాంతం ఒక చక్కటి ఉదాహరణ.
టిక్ టాక్ చూడటం ఒక ఎత్తు. దాన్నో వ్యసనంగా మార్చేసుకొని.. తమలోని ప్రతిభను ప్రదర్శించుకునేందుకు చేస్తున్న వీడియోలతోప్రాణాలు పోతున్నాయి. తాజాగా కర్ణాటకకు చెందిన కోలార్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల మాలా బీఏ చదువుతోంది. బాగా చదివే ఈ అమ్మాయికి ఇటీవల రూ.10వేల స్కాలర్ షిప్ కూడా వచ్చింది. ఇంట్లో వారికి సైతం ఆ అమ్మాయి మీద ఎలాంటి ఫిర్యాదులు లేవు.
కాకుంటే ఈ మధ్య టిక్ టాక్కు బాగా అలవాటు పడిన మాలా.. ఇంటి వెనుకాల టిక్ టాక్ వీడియో తీసుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె.. వీడియో తీసుకునే ఉత్సాహంలో ముంచుకొస్తున్న ముప్పును గమనించలేకపోయింది. ఇంటి నీళ్ల సంపులో ప్రమాదవశాత్తు పడి.. ఆ వెంటనే మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. చేతికి వచ్చిన కుమార్తె ఇలా ప్రాణాలు పోవటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.