శశికళ రాక..అన్నాడీఎంకే పార్టీపై కార్తీ చిదంబరం సంచలన వ్యాఖ్యలు

Update: 2020-07-19 04:51 GMT
అవినీతి ఆరోపణలతో జైలు పాలైన మాజీ ముఖ్యమంత్రి.. దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ త్వరలోనే జైలు నుంచి విడుదల అవుతున్నారనే తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆమె వచ్చి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెడతారనే వార్త ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి తనయుడు ఎంపీ కార్తీ చిదంబరం చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే శశికళ చేతిలోకి అన్నాడీఎంకే పార్టీ వెళ్లడం కాయమని కార్తీ తెలిపడం ఆసక్తికరంగా మారింది.

కర్నాటకలోని బెంగళూరు నుంచి చెన్నైకి కారులో వెళ్తండగా తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా ఆంబూరు బస్టాండ్‌ ప్రాంతంలో కొద్దిసేపు ఆగారు. అక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే అన్నాడీఎంకే పార్టీ పూర్తి అధికారాలను ఆమె చేజిక్కించుకోవడం ఖాయమని సంచలన ప్రకటన చేశారు. టీటీవీ దినగరన్‌ మరోసారి అన్నాడీఎంకే పార్టీలో చేరిపోతారని జోష్యం చెప్పారు. వారి కుటుంబం అదుపులోనే పార్టీ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమలులో ఉండడంతో నిబంధనలకు విరుద్ధంగా కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరడంతో ఆంబూరు పోలీసులు కార్తీ చిదంబరంతో పాటు 50 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.
Tags:    

Similar News