''అడుసు తొక్కనేల? కాలు కడగనేల?'' అంటారు పెద్దలు. అంటే ఇంకా తెలుగులో చెప్పాలంటే.. బురదలో కాలు పెట్టడం ఎందుకు.. ఆ తర్వాత ఇబ్బంది పడుతూ కాళ్లు కడుక్కోవడం ఎందుకు? అని అర్థం. క్రికెటర్ దినేశ్ కార్తీక్ వ్యవహారానికి ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. మహిళపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసిన దినేశ్.. దాన్ని కామెడీ అనుకున్నాడు. కానీ.. జనాలంతా సీరియస్ గా తీసుకున్నారు. సోషల్ మీడియాలో తెగ వాయించేశారు. దీంతో.. దెబ్బకు దిగిరాక తప్పలేదు. మరి, ఇంతకీ ఏం జరిగిందీ? అన్నది చూద్దాం...
దినేష్ కార్తీక్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు. క్రికెట్ కామెంటేటర్ గా మారిపోయాడు. ఈ మధ్యనే అఫీషియల్ గా కామెంటరీ బాక్సులోకి అడుగు పెట్టిన దినేష్.. తనదైన వ్యాఖ్యానంతో అందరినీ అలరించాడు. భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ లో కామెంటరీ చేసి మెప్పించాడు కూడా. ఆయన కామెంటరీని క్రికెట్ పెద్దలు కూడా మెచ్చుకున్నారు. దీంతో.. దినేశ్ లో జోష్‌పెరిగింది.
అయితే.. తాజాగా ఇంగ్లండ్ - శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ కు కామెంట్రీ చెబుతూ.. కొత్తగా సైకిల్ నేర్చుకుంటున్న పిల్లాడిలా బొక్కబోర్లా పడిపోయాడు. జోక్ పేలుస్తున్నానని తాను అనుకున్నాడు.. అది మహిళలపై కావడంతో రివర్స్ కొట్టింది. దీంతో.. సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతున్నారు నెటిజన్లు. మరి, ఇంతకీ.. దినేష్ ఏమన్నాడో చూద్దాం.
బ్యాట్స్ మెన్ కు బ్యాట్ కు మధ్య ఉన్న రిలేషన్ గురించి తనదైన వ్యాఖ్యానం జోడించాడు టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్. ''చాలా మంది బ్యాట్స్ మెన్లు తమ బ్యాట్లను ఇష్టపడినట్టు కనిపించరు. వాళ్లు ఇతర ఆటగాళ్ల బ్యాట్లను ఇష్టపడుతుంటారు. ఆ బ్యాట్లు చుట్టుపక్కల ఉండే ఇతరుల భార్యల్లాంటివి'' అని అనేశాడు. దీంతో.. అడ్డంగా బుక్కైపోయాడు దినేష్ కార్తీక్.
ఇతరుల భార్యల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు దినేష్ కార్తీక్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కామెంటరీ పేరుతో ఇష్టారీతిన మాట్లాడడం సబబు కాదని మందిపడ్డారు. దినేష్ కార్తీక్ పర్సనల్ లైఫ్ గురించి తెలిసినవారు.. ఆ విషయాన్ని లాగిమరీ సెటైర్లు వేశారు. ''నీ పర్సనల్ లైఫ్ లో జరిగిన విషయాన్ని.. కామెంటరీలో చెప్పావా?'' అని కామెంట్ చేశారు. దినేష్ కార్తీక్.. ఫస్ట్ వైఫ్ తో విడాకులు తీసుకున్నాడు. ఆమె మరో క్రికెటర్ మురళీ విజయ్ నే పెళ్లి చేసుకుంది.
మరికొందరు.. వాట్సాప్ జోకులను నమ్ముకొని కామెంట్ చేస్తే.. బొక్కబోర్లా పడాల్సి వస్తుందని కౌంటర్ వేశారు. ఇంకొందరు సీరియస్ గానే తిట్లదండకం అందుకున్నారు. మహిళలపై గౌరవం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. దినేష్ కార్తీక్ ఎట్టకేలకు స్పందించాడు. తాను ఈ కామెంట్లు కావాలని చేయలేదని, అది కూడా తప్పుడు ఉద్దేశంతో అసలేకాదని అన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.