ఆదివారం. అందరికి హాయయిన వారం. కాని తెలంగాణ ముందస్తు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధులకు మాత్రం అమ్మో ఆదివారంగా ఉంది. పైగా కార్తీక మాసం చివరి ఆదివారం కావడం... ఎన్నికలకు కేవలం ఐదు రోజులే వ్యవధి ఉండడంతో ఈ ఆదివారం అభ్యర్ధులకు గుబులు పుట్టిస్తోంది. ఇదంతా ఎందుకనుకుంటున్నారా. ఏం లేదు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు ఓటర్లను ప్రసన్నం చేసుకుందుకు కార్తీక మాస వన భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. తమ తమ నియోజక వర్గాల్లో వివిధ కాలనీలు - కుల సంఘాల వారితో ఏర్పాటు చేస్తున్న ఈ వన భోజనాలకు కనీసం ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకూ ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో నియోజకవర్గంలోనూ అథమ పక్షం నాలుగు నుంచి ఐదు కాలనీలు - పది వరకూ కుల సంఘాలు ఉంటున్నాయి. వీరిలో కొందరికి గత ఆదివారం కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేశారు. మిగిలిన వారికి ఈ ఆఖరి ఆదివారం నాడు వనభోజనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ ఆదివారం ఏర్పాట్లలో పలు పార్టీలకు చెందిన అభ్యర్ధుల అనుచరగణం ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణలో ఎన్నికల సమరం ముంచుకొస్తున్న కొద్దీ అధికార - ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్ధుల్లో ఓటమి భయం వెంటాడుతోంది. ముఖ్యంగా ప్రజాకూటమిగా ఏర్పడిన పార్టీలను ఈ ఓటమి భయం వెన్నంటి ఉంది. దీంతో వారంతా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వివిధ ప్రలోభాలను తెర మీదకు తీసుకువస్తున్నారు. ఇందులో భాగమే కార్తీక వనభోజనాలు. కార్తీక మాసంలో కొందరు మాంసం ప్రియులు దీనికి దూరంగా ఉంటారు. అలాంటి వారి కోసం వెజిటేరియన్ లో వివిధ రకాలు వడ్డిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే మద్యం మాత్రం అందరికీ అవసరమేనని - ఇది లేనిదే కార్తీక మాసం వనభోజనాలకు అర్ధమే లేదని కొందరంటున్నారు. దీంతో ఒక్కో వన భోజనానికి కనీసం ఐదు వందల మంది హాజరైనా వారిలో అథమ పక్షం మూడు వందల మందికి మందు అందించాల్సి ఉందంటున్నారు. దీంతో కనీసం పది లక్షల రూపాయలు కేవలం మందుకే ఖర్చు చేయాల్సి వస్తోందంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే నియోజకవర్గంలో పది వన భోజనాలు ఏర్పాటు చేసినా మందు కోసమే పది లక్షల వరకూ ఖర్చవుతుందంటున్నారు. ఇది తలచుకునే అభ్యర్ధుల గుండెల్లో మందు రైళ్లు పరిగెడుతున్నాయంటున్నారు. ఇప్పటి వరకూ ఖర్చు చేసింది ఒక ఎత్తు అయితే ఇక ముందు ఖర్చు చేసేది మరో ఎత్తు అని అభ్యర్ధులు అంటున్నారు. ఈ వారం రోజుల్లోనే ఓటర్ల మనసు కొల్లగొట్టాలని లేకపోతే సీన్ మారిపోతుందనేది అభ్యర్ధుల మనోగతం.దీనికి అనుగుణంగానే డబ్బులు వెదజల్లేందుకు ముందుకు ఉరుకుతున్నారు.