క‌రుణ ఖ‌న‌నంపై వివాదం..కోర్టు కీల‌క తీర్పు

Update: 2018-08-07 17:07 GMT
 కరుణానిధి అంత్యక్రియలపై వివాదం నెలకొంది. డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె. స్టాలిన్ తమిళనాడు సీఎం పళనిస్వామిని కలిసి మెరినా బీచ్‌ లో అన్నాదురై సమాధి దగ్గర ఖననం చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరారు. కాగా న్యాయపరమైన చిక్కులు వస్తాయని పేర్కొంటూ ప్రభుత్వం అక్కడ అంత్యక్రియలకు అనుమతి ఇవ్వలేదు. దానికి బదులుగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ రోడ్‌ లో గల గాంధీ మండపం దగ్గర రెండు ఎకరాల స్థలం కేటాయిస్తామని పేర్కొంది.దీనిపై డీఎంకే నిర‌స‌న వ్య‌క్తం చేసింది.

అయితే, మెరీనా బీచ్‌ లో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించేందుకు తమిళనాడు ప్రభుత్వం నో చెప్పడంతో ఈ ఎపిసోడ్ కోర్టు మెట్లెక్కింది. మద్రాస్ హైకోర్టులో డీఎంకే పిటీషన్ దాఖలు చేసింది. డీఎంకే పిటీషన్‌ ను మంగళవారం రాత్రి 10గంటల 30నిమిషాలకు విచారించేందుకు మద్రాస్ హైకోర్టు ప్రస్తుత చీఫ్ జస్టిస్ హులువాడి జి.రమేష్ ఒప్పుకున్నారు.

ఇదిలాఉండ‌గా...కరుణానిధి భౌతికకాయాన్ని కావేరీ హాస్పిటల్ నుంచి గోపాలపురంలోని ఆయన నివాసానికి తరలించారు.గోపాలపురంలోని కరుణానిధి నివాసం దగ్గర పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు. దీంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. కరుణానిధి అంత్యక్రియలు రేపు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రజలు - అభిమానుల సందర్శనార్ధం రేపు ఉదయం కరుణానిధి భౌతికకాయాన్ని రాజాజీ హాలులో ఉంచనున్నారు. తర్వాత అంతిమయాత్ర ప్రారంభం కానుంది.


Tags:    

Similar News