కరుణానిధి సరికొత్త రికార్డు

Update: 2017-06-02 08:17 GMT
తమిళనాడు మాజీ సీఎం - డీఎంకే అధినేత కరుణానిధి దేశంలోనే అత్యంత కురువృద్ధుడైన రాజకీయ నేతగా గుర్తింపు పొందుతున్నారు. 95వ ఏట అడుగుపెట్టిన ఆయన దేశంలోని ముఖ్య రాజకీయ నేతలందరిలోనూ పెద్దవారిగా నిలిచారు. ముఖ్యమంత్రులుగా - కేంద్ర మంత్రులుగా - గవర్నర్లుగా - ప్రధానులుగా - ప్రధాన పార్టీల అధ్యక్షులుగా పనిచేసినవారెవరూ అంత వయసు కలిగి లేకపోవడంతో కరుణానిధే దేశంలోని సమకాలీన నేతల్లో అత్యంత పెద్ద నేతగా గుర్తింపు పొందారు.
    
1969 తర్వాత తమిళనాడు రెండు మూలస్తంభాల్లో కరుణ ఒకరుగా నిలిచారు. అంతేకాదు... డీఎంకేకు 48 ఏళ్లుగా ఆయనే  అధ్యక్షుడిగా ఉన్నారు. ఇదైతే ప్రపంచ రికార్డని రాజకీయవర్గాలు అంటున్నాయి. ప్రపంచంలోని ఇంకే రాజకీయ పార్టీకి కూడా ఇంత సుదీర్ఘ కాలం ఒకే వ్యక్తి అధికారికంగా నేతృత్వం వహించలేదు.
    
జర్నలిస్టుగా - నవలా రచయితగా - కవిగా - స్క్రిప్ట్ రైటర్‌ గా - నటుడిగా - నిర్మాతగా - విద్యావేత్తగానూ కరుణానిధి సుప్రసిద్ధులు. ఆయన రాసే మాటలు ప్రజల్లోకి చొచ్చుకుపోతాయని... ఆయన రాజకీయ జీవితం తొలినాళ్లలో అప్పటి దిగ్గజ తమిళనేతలకు ఉపన్యాసాలు రాసిచ్చేవారని... వాటిని వారు చదువుతుంటే జనం ఉర్రూతలూగేవారని చెప్తారు. తెలుగులోనూ మంచి ఉపన్యాసకులుగా, జనాన్ని మెస్మరైజ్ చేసిన నేతలుగా పేరున్నవారు కూడా అప్పటి కరుణ డైలాగులను కాపీ కొట్టే ప్రసంగాలను తయారుచేసుకున్న సందర్భాలున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News