కాలం కలిసి రాకపోతే పరిస్థితులు ఇలానే ఉంటాయేమో. ఎన్నికల్లో గెలుపోటములు ఎంత చిత్రంగా ఉంటాయన్నది తాజా తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూస్తే అర్థమవుతుంది. ఎన్నికల్లో విజయం సాధించారనటానికి బండ లెక్క ఏంటి? ప్రత్యర్థి కంటే ఎక్కువ ఓట్లు రావటం. మరి.. ప్రత్యర్థి పార్టీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా ఓటమి ఎదురవుతుందా? అంటే అవుననే చెప్పాలి. తాజాగా.. తమిళనాడులో జరిగింది ఇదేనని చెప్పాలి. ఎందుకంటే.. ఓట్ల విషయంలో అన్నాడీఎంకే కన్నా డీఎంకే కు ఓట్లు వచ్చినా సీట్లు తక్కువగా వచ్చిన చిత్రమైన పరిస్థితి నెలకొంది.
అదెలానంటే.. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 232 స్థానాలకు పోలింగ్ జరిగాయి. ఇందులో అన్నాడీఎంకే 232 స్థానాలకు పోటీ చేస్తే.. డీఎంకే మాత్రం మిత్రపక్షాలకు సీట్లు ఇవ్వగా తాను సొంతంగా కేవలం 176 స్థానాల్లో పోటీ చేసింది. ఈ 176 స్థానాలకు డీఎంకేకు పోలైన ఓట్లు 41.05 శాతం కాగా.. 232 స్థానాల్లో పోటీ చేసిన జయలలిత పార్టీకి 40.78 శాతం ఓట్లు వచ్చాయి.
అంటే.. కరుణ పార్టీ కానీ ఎక్కువ సీట్లలో పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండి ఉండేదన్న మాట. ఈ కారణంతోనే.. అధికారిక అన్నాడీఎంకే కంటే ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ.. పోటీ చేసింది తక్కువ సీట్లలో కావటంతో ఫలితం తారుమారైన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే.. డీఎంకే బలోపేతంగా ఉన్నప్పటికీ.. ఆ పార్టీ జత కట్టిన మిత్రపక్షాల వైఫల్యం డీఎంకేను దెబ్బ తీసిందని చెప్పాలి.
ఈ విషయం మరింత అర్థం కావాలంటే ఒక చిన్న లెక్కను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. డీఎంకే తాను సొంతంగా పోటీ చేసిన స్థానాల్లో 41.05 శాతం ఓట్లు సాధించినప్పటికీ..కూటమిగా చూస్తే.. వారికి పోలైన ఓట్లు 39.7 శాతం మాత్రమే. అంటే.. అన్నాడీఎంకేకు.. డీఎంకే కూటమికి మధ్యనున్న 1.1 శాతం ఓట్లు తేడా ఫలితాన్ని తారుమారు చేసింది. ఈ స్వల్ప వ్యతాసం డీఎంకేను ఎంత కొంప ముంచిందంటే.. జయలలిత పార్టీకి 134 సీట్లు వచ్చేలా చేస్తే.. డీఎంకేకు 98 సీట్లకు పరిమితం అయ్యేలా చేసింది.