గుర‌జాల వైసీపీలో తిర‌`కాసు`.. అడ్డంగా బుక్క‌వుతున్నారే!

Update: 2020-12-24 07:30 GMT
పోక చెక్క‌తో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నే రెండంటా! అనే సూత్రం రాజ‌కీయాల‌కు వ‌ర్తించేదే. అయితే.. దీనికి కూడా స‌మ‌యం సంద‌ర్భం అనేవి ఉంటాయి. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నాయ‌కులు అడుగులు వేయాలి. పార్టీలు ఏవైనా స‌రే.. స‌మ‌యం స‌రిగా లేన‌ప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నేత‌లైనా మౌనం పాటించ‌క త‌ప్ప‌దు. గ‌తంలోనూ ఇలాంటి ప‌రిస్థితులు గ‌మ‌నించాం. అనేక మంది నాయ‌కులు సంయ‌మ‌నం పాటించిన ప‌రిస్థితులను కూడా మనం చూశాం. అయితే.. దీనికి భిన్నంగా త‌న‌కు దూకుడు మాత్ర‌మే తెలుసు అన్న విధంగా వ్య‌వ‌హ‌రిస్తూ..త‌న‌ను తాను మైన‌స్‌ల‌లోకి నెట్టేసుకుంటూ.. పార్టీని సైతం ఇరుకున పెట్టేస్తున్నారు గుంటూరు జిల్లా గుర‌జాల ఎమ్మెల్యే కాసు మ‌హేష్‌రెడ్డి.

గుంటూరులో కీల‌క‌మైన గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి బ‌లం ఎక్కువ‌. గ‌డిచిన మూడు ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండు సార్లు య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు విజ‌యం సాధించారు. దీంతో ఆయ‌న‌కు కేడ‌ర్ స‌హా అభిమానులు ఎక్కువ‌గా ఉన్నారు. అయితే.. గ‌త ఏడాది జ‌గ‌న్ సునామీ నేప‌థ్యంలో య‌ర‌ప‌తినేని విజ‌యం సాధించ‌లేక పోయారు. ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున కాసు మ‌హేష్ రెడ్డి విజ‌యం సాధించారు. దీంతో ఆయ‌న దూకుడు ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు.కానీ, సొంత పార్టీలోనే నేత‌ల‌తో కుంప‌ట్లు పెట్టుకోవ‌డం.. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వంటి బ‌ల‌మైన నాయ‌కుల‌తోనూ వివాదాలతో ముందుకు సాగుతుండ‌డంతో స‌హ‌జంగానే ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలో య‌ర‌ప‌తినేని దూకుడు పెంచారు. వ‌రుస స‌భ‌లు నిర్వ‌హిస్తూ.. ఏదో ఒక అంశంపై రాజ‌కీయం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో నే సిట్టింగ్ ఎమ్మెల్యే కాసుపై విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు. ఆయ‌నను వారాల బ్బాయ్ అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తొడ‌గొట్టి.. మీసం మెలేస్తున్నారు. గ‌నులు దోచేస్తున్నార ‌ని .. టీడీపీ నేత‌ల‌ను హ‌త్య‌లు చేయిస్తున్నార‌ని కూడా విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో మ‌రీముఖ్యంగా త‌న సొంత పార్టీలోనే సీనియ‌ర్లు త‌న‌కు దూరంగా ఉన్న స‌మయంలో కాసు వ్య‌వ‌హ‌రిం చాల్సిన తీరు.. సంయ‌మ‌నం పాటించ‌డం. కానీ, ఆయ‌న అలా చేయ‌డం లేదు. మాటకు మాట అనేస్తున్నారు. విమ‌ర్శకు ప్ర‌తివిమ‌ర్శ చేస్తున్నారు. అయితే.. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌.. అడ్డంగా బుక్క‌వుతున్నారు. మీరు తిన‌లేదా? హ‌త్యా రాజ‌కీయాలు మీరు ప్రోత్స‌హించ‌లేదా?  మీపై కేసులు లేవా? అంటూ.. ప‌రోక్షంగా వైసీపీ నేత‌లు త‌ప్పులు చేస్తున్నార‌నేలా మాట్లాడేశారు. దీంతో కాసు వైఖ‌రి.. ఇక్క‌డి వైసీపీ నేత‌ల‌కు త‌ల‌నొప్పిగా మారింది. తాజా వ్యాఖ్య‌ల‌పై అధిష్టానంకూడా దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News