గోదావరిని వెలివేశారు.. కారణమిదే..!!

Update: 2019-09-22 06:41 GMT
గోదావరి.. నదీమ తల్లి.. వరద గోదావరిని ఆ తీరం వెంబడి ఉన్న వాళ్లంతా దేవతగా కొలుస్తారు. 12 ఏళ్ల కోసారి పుష్కరాలతో పూజిస్తారు. తెలుగు రాష్ట్రాల దాహార్తి తీరుస్తున్న గోదావరి ఇప్పుడు మైలపడిందట.. గోదావరి నదిలో బోటు మునిగిపోయి 40 మందికి పైగా చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా 12 మంది ఆచూకీ తెలియరాలేదు. వారంతా నదీ గర్భంలోనే మునిగిపోయారని అందరూ అంచనా వేస్తున్నారు.

అయితే తాజాగా గోదావరి నదీమ తల్లి మైలపడిందని.. చివరి మృతదేహాన్ని వెలికి తీసేంత వరకు ఆ నీటిని వాడేది లేదని కచ్చలూరు దిగువ ప్రాంతాల గ్రామాల ప్రజలు - గిరిజనులు తేల్చి చెబుతున్నారు.

ఇన్నాల్లు గోదావరి తీరం వెంబడి ఉన్న మారుమూల గ్రామాల్లో ప్రధాన నీటి వనరు గోదావరియే.. గోదావరి నుంచి వారు సాగు - తాగునీరునే వాడేవారు. అయితే గోదావరి నదిలోని కచ్చలూరు వద్ద పడవ మునగడం.. 40 మందికిపైగా చనిపోవడంతో గోదావరి పరివాహక గిరిజన గ్రామాల వారు ఇప్పుడు గోదావరి నది నీటిని వాడేందుకు ఇష్టపడడం లేదు. గోదావరి మైలపడిందని పూర్తిగా వదిలేశారు. ఆ నీటిని వాడడం లేదు. మొత్తం 10 నుంచి 12 గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొందట..

ఇప్పుడు గోదావరిలోని చివరి మృతదేహం తీసేవారకు ఆ నీటిని వాడమని గ్రామస్థులంతా తీర్మానించారట.. అందుకే కాస్త దూరమైన - బోర్లు - కొండలపై నుంచి వచ్చే జల కాలువల వద్దకు వెళ్లిని గ్రామస్థులంతా నీటిని తెచ్చుకుంటున్నారట..

మృతదేహాలన్నీ బయటకొచ్చాకే నదిని శుద్ధి చేసి పూజలు చేశాకే ఆ నీటిని వాడుకుంటామని వారంతూ గోదావరిని వెలివేయడం హాట్ టాపిక్ గా మారింది.
   

Tags:    

Similar News