భార‌త్‌ లో ఆ యువ‌రాణికి గౌన్ క‌ష్టాలు!

Update: 2016-04-12 09:53 GMT
అనుకుంటాం కానీ ప్ర‌ముఖుల క‌ష్టాలు అన్నిఇన్ని కావు. వారు కాలు బ‌య‌ట‌కు పెట్టిన క్ష‌ణం నుంచి వారిని స‌వాల‌క్ష క‌ళ్లు వెంటాడుతుంటాయి. ఇక‌.. కెమేరా క‌ళ్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే. త‌మ‌కు ఎదుర‌య్యే క‌ష్టాల్ని గుర్తించి ఆచితూచి అడుగులు వేసే సెల‌బ్రిటీలు అప్పుడ‌ప్ప‌డు మాత్రం అంచ‌నాలు త‌ప్పి అడ్డంగా బుక్ అయిపోతుంటారు.

తాజాగా అలాంటి లెక్కే త‌ప్పి విప‌రీత‌మైన ఇబ్బందికి గురి అయ్యారు బ్రిట‌న్ ప్రిన్స్ విలియం స‌తీమ‌ణి కేట్‌. ప్ర‌స్తుతం భ‌ర్త‌తో క‌లిసి భార‌త పర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆమె దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్ని చుట్టేస్తున్నారు. త‌మ వ‌స్త్రాలంక‌ర‌ణ‌తో మీడియాలో ప్ర‌ముఖంగా ద‌ర్శ‌న‌మిస్తున్న యువ‌రాణికి ఊహించ‌ని రీతిలో పెద్ద‌క‌ష్ట‌మే వ‌చ్చి ప‌డింది. అమ‌ర‌జ‌వాన్ జ్యోతి వ‌ద్ద నివాళులు అర్పించే స‌మ‌యంలో ఆమె అనుకోని ఇబ్బందిని ఎదుర్కొన్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన సంద‌ర్భంగా ఆమె వైట్ క‌ల‌ర్ పొట్టి ఫ్రాక్ వేసుకున్నారు. నిజానికి భార‌త ప‌ర్య‌ట‌న‌లో నిండైన దుస్తులు ధ‌రించిన‌ప్ప‌టికీ.. ఈ కార్య‌క్ర‌మానికి ఆమె పొట్టి గౌన్ వేసుకున్నారు. నివాళులు అర్పించే స‌మ‌యంలో గాలి బాగా వీస్తుండ‌టంతో ఆమె దుస్తులు ఎగ‌ర‌టం.. వాటిని స‌ర్దుకోలేక ఆమె ప‌డిన అవ‌స్థ‌లు అన్నిఇన్ని కావు. ఆమె గౌన్‌ను స‌ర్దుకునే స‌మ‌యంలో తీసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌డావుడి చేస్తున్నాయి. ప్ర‌ఖ్యాత హాలీవుడ్ సుంద‌రి మార్లిన్ మున్రో ఫేమ‌స్ స్టిల్ (సెవ‌ర్ ఇయ‌ర్స్ ఇచ్ సినిమాలోంది) అయిన గౌన్ గాలికి ఎగురుతుంటే దాన్ని స‌ర్దుకునే ఫోటో చూస్తే.. యువ‌రాణి  ఎంతగా ఇబ్బంది ప‌డ్డారో తెలుస్తుంది.

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌డావుడి చేస్తున్న ఈ చిత్రంపై విమ‌ర్శ‌లు ఘాటుగానే వినిపిస్తున్నాయి. ఒక మ‌హిళ ప‌డే ఇబ్బందిని ఇలా ఫోటోలుగా తీసి షేర్ చేయ‌టం.. దానికి లేనిపోని వ్యాఖ్యానాలు జోడించ‌టం ఏమిటంటూ మండిప‌డే వారి సంఖ్య కూడా త‌క్కువ‌గా ఏమీ లేదు. ఏమైనా.. వ‌స్త్రాల ఎంపిక విష‌యంలో వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్ని కాస్త దృష్టిలో పెట్టుకుంటే మంచిదేమో..?
Tags:    

Similar News