నెత్తిన బట్ట.. కింద బాణెడు పొట్ట.. గుండ్రటి ఆకారం.. కత్తి మహేష్ రూపంపై సోషల్ మీడియా సాక్షిగా ఎన్నో వెటకారాలు.. దెప్పిపొడవలు.. కత్తి మహేష్ సోషల్ మీడియా యాక్టివిస్ట్.. పైగా రివ్యూరైటర్.. జర్నలిస్టు కూడా.. ఈయన విధానపరమైన నిర్ణయాలను ఎత్తిచూపుతుంటాడు. పవన్ , చంద్రబాబు సహా ఎవ్వరినీ వదలకుండా దెప్పిపొడుస్తూనే ఉంటాడు.. అందుకే అందరికీ టార్గెట్ అయ్యారు.
ఆ వివాదాస్పద వైఖరితో విమర్శలను ఎదుర్కొంటాడు. సోషల్ మీడియా సాక్షిగా కత్తి మహేష్ లావుగా ఉంటాడని.. అతడి ఆకారంపై బోలెడు జోక్స్ పేల్చుతుంటారు. అయితే తనను తిట్టే వాళ్లకు కత్తి మహేష్ తాజాగా ఒక ఫేస్ బుక్ పోస్టులో ఒకటే సమాధానం ఇచ్చాడు. ఇలా లోపాలతో మనుషులను అవమానించే వాళ్లవి ఎంత వికారమైన మనసులో అని వాళ్ల మీద దయ కలుగుతుందని చెప్పుకొచ్చాడు. వాళ్లని మానసిక వైద్యుడి దగ్గరకు పంపాలంటూ కౌంటర్ ఇచ్చాడు. తనను తిట్టే వాల్లు అంతా మానసిక రోగులని.. వారికి తన ప్రగాఢ సానుభూతి అంటూ ఘాటుగా స్పందించాడు.
ఇక తాను ఇలా తయారవ్వడానికి గల కారణాలు వివరించి కత్తి మహేష్ అందరికీ కనువిప్పు కలిగించాడు. తను యుక్త వయసులో ఎంతో సన్నగా.. స్మార్ట్ గా ఉన్న పాత ఫొటోను షేర్ చేసి తన వాల్ పై పెట్టుకున్నారు. తాను ఇలా లావుగా తయారు కావడానికి థైరాయిడ్ కారణమని.. ఇప్పుడు దానితో ఫైట్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. తిన్నది అరగించుకునే శక్తి లేక.. కొంచెం పనిచేసినా బద్దకం ఆవహించి నీరసించి పోయేలా చేసే థైరాయిడ్ వల్లే తాను ఇలా లావెక్కానని వివరించారు. ఈ ఉబకాయం తిండి వల్ల వచ్చింది కాదని.. అయినా తాను తిండి తాను సంపాదించేనని.. మీ ఇంట్లోంచి తెచ్చింది కాదుకదా అని విమర్శకులకు గట్టిగా బుద్ది చెప్పారు.
కత్తి మహేష్ ఎమోషనల్ పోస్టు.. శరీరాన్ని బట్టి వ్యక్తులను విమర్శించే వారికి ఒక హెచ్చరికలాంటిది. అతడు ఎంత క్రిటిక్ గా ఎన్ని విమర్శలు చేసినా.. సైద్ధాంతిక పరంగా విమర్శిస్తే ఎలాంటి బాధ ఉండదు.. అదే వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తిడితేనే కష్టం. ఇప్పుడు అలా తిట్టేవాళ్లకు ఈ ‘కత్తి’ కలం పోటు ఒక గుణపాఠంగా చెప్పకతప్పదు.