తాను అనుకున్నది ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేస్తున్న కత్తి మహేశ్.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు.. ఏపీ మంత్రి నారా లోకేశ్ పై ఆరోపణాస్త్రాల్ని సంధించారు. సోషల్ మీడియాలోనూ.. ఎలక్ట్రానిక్ మీడియాలోనూ మహా హుషారుగా ఉండే కత్తి.. తాజాగా లోకేశ్ ను టార్గెట్ చేశారు.
ఇటీవల విడుదల చేసిన రాయలసీమ డిక్లరేషన్.. తాజాగా జరిగిన విశాఖ సీఐఐ సదస్సు.. ఆ సందర్భంగా చేసుకున్న ఎంవోయూల గురించి పలు ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా కులం కార్డును కత్తి సంధించటం ఆసక్తికరంగా మారింది. గతంలో తనను కులం కారణంగా తనను పక్కన పెట్టేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన కత్తి.. ఇప్పుడు కమ్మోళ్లు అంటూ ఓపెన్ గా ఫైర్ అయిపోయారు.
కమ్మోళ్లకు తప్ప మరే కులపోళ్లకూ చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ది ఎందుకు కనిపించదు చెప్మా? అంటూ ట్వీట్ చేయటం కలకలంగా మారింది. అక్కడితో ఆగని కత్తి.. అప్పులు సంపాదించగలగటమే మెగా ఇండికేటర్ అని బాబు చెప్పటం.. మనం నమ్మటమన్న ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాటు.. మన భవిష్యత్ లోకేశ్ పాలు.. ఇదే కమ్మోళ్లకు .. టీడీపీకి కావాల్సింది అంటూ చినబాబుపై విమర్శల ట్వీట్లు చేశారు. కత్తి తాజాగా చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ కావటమే కాదు.. పెద్ద ఎత్తున చర్చకు తెర తీస్తున్నాయి. కులంపేరుతో తనను తొక్కేస్తున్నారంటూ మండిపడే కత్తి లాంటోడు.. ఇప్పుడు కులం కార్డును బయటకు తీయటం హాట్ టాపిక్ గా మారింది. పరిస్థితికి తగ్గట్లుగా తన మాటలకు తానే కొత్త అర్థం చెప్పుకునే కత్తి రానున్న రోజుల్లో తన ట్వీట్లతో మరెన్ని సంచలనాలకు తెర తీయనున్నాడో?