జనసేనాని పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా కానీ.. వెంటనే ఓ గొంతు ప్రశ్నించడానికి ముందుకు వస్తుంది. అందరినీ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ నే ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇప్పుడు వైరి పక్షంగా ఉన్న చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ పై అంతలా విమర్శలు చేసి ఉండరేమో.. ఇలా వరుసగా విరుచుకుపడుతూ పవన్ కళ్యాణ్ కు పక్కెలో బల్లంలా తయారయ్యాడు కత్తి మహేష్. పవన్ ఏదైనా మాట అనడం పాపం.. దానికి కౌంటర్లు ఇస్తూ దాడి మొదలుపెట్టేస్తున్నారు. వీరిద్దరి వైరం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవలే పవన్ కళ్యాణ్ తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఏపీ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగింది. ఇప్పుడీ పవన్ మాటకు వివాదాస్పద రివ్యూ రైటర్ కత్తి మహేష్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ఒంగోలులో ఆదివారం ఆయన దళిత సంఘాల నేతలతో సమావేశమై మాట్లాడారు. పవన్ కళ్యాణ్ హత్యకు జరుగుతున్న కుట్ర ఆధారాలను ఆయనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే పవన్ ఇలా అవాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నారని మండిపడ్డారు.
ఇక తన రాజకీయ భవిష్యత్ గురించి కూడా కత్తి మహేష్ పలు నిర్ణయాలు తీసుకున్నట్టు వివరించాడు. 2019 ఎన్నికల్లో తాను రాజకీయాల్లోకి వస్తానని.. చిత్తూరు జిల్లా ఎంపీగా పోటీచేసే అవకాశం ఉందని తెలిపారు. దళితులు రాజ్యాధికారం సాధించాలని.. 2019 ఎన్నికల్లో దళితులదే వాయిస్ అని స్పష్టం చేశారు. ప్రణయ్ హత్య కులదురంహకార హత్యగా కత్తి అభివర్ణించారు. ఉగ్రవాదులతో చేతులు కలిపి మారుతీరావు దళితుడిని హత్య చేయించాడని ఆరోపించాడు.