కత్తి మళ్లీ దింపాడు

Update: 2019-01-28 06:04 GMT
కత్తి మహేశ్‌. సోషల్ మీడియా బాగా పాపులర్‌ అయ్యాక తనకు తాను పాపులర్‌ అయిన సోషల్‌ మీడియా స్టార్‌. తెలంగాణ ప్రభుత్వం 6 నెలల నగర బహిష్కరణ విధించడంతో.. కొన్నాళ్లు కన్పించలేదు. ఆరు నెలలు గడువు అయిపోవడంతో.. హైదరాబాద్‌ లో ఎంటర్‌ అయ్యాడు కత్తి. వచ్చీ రావడంతోనే.. కత్తి దింపడం మళ్లీ మొదలుపెట్టాడు. ప్రతీసారి పవన్‌ పై విమర్శలు చేసే కత్తి మహేశ్‌.. ఈసారి డోస్‌ పెంచాడు. పవన్‌ తో పాటు చంద్రబాబుని కూడా టార్గెట్‌ చేశాడు.

నాకు గుండు కొట్టింది పరిటాల రవి కాదు అని పవన్‌ కల్యాణ్ స్టేట్‌ మెంట్‌ ఇచ్చినట్లుగా - నా తండ్రిని చంపింది టీడీపీ నేతలు కాదు అని వంగవీటి రాధా అన్నట్లుగా - అలాగే చంద్రబాబు మా నాన్నను వెన్నుపోటు పొడవలేదు అని బాలకష్ణ అన్నట్లుగా ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశాడు కత్తి. ఫైనల్‌ గా.. సరెండర్ అయినవాళ్లు ఇలాంటి భాషే వాడతారంటూ  కౌంటర్‌ వేశాడు. అంటే.. పవన్‌ - వంగవీటి రాధా - బాలయ్య అంతా రకరకాల కారణాల వల్ల.. అమ్ముడుపోయారంటూ తీవ్రవ్యాఖ్యలు చేశాడు కత్తి మహేశ్‌.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు కత్తి మహేశ్‌. ఆ ఉద్దేశంతోనే పార్టీల మీద వ్యాఖ్యలు చేస్తున్నాడు. తనకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉందని చెప్పిన కత్తి.. వైసీపీలో చేరతాడని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. అందుకే అందరిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌.. వైసీపీ - బీజేపీపై ఒక్క కామెంట్‌ కూడా చేయలేదని విమర్శలు విన్పిస్తున్నాయి.
Tags:    

Similar News