సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతో సెలబ్రిటీ హోదా దక్కించుకున్న తొలితరం తెలుగు వ్యక్తిగా కత్తి మహేశ్ నిలిచిపోతారు. సినీ విమర్శకుడన్న ట్యాగ్ తో మొదలైన ఆయన ప్రయాణం.. బిగ్ బాస్ షోలో పాల్గొనటం ద్వారా ఒక మలుపు తిరిగితే.. కొన్ని మీడియా ఛానల్స్ కు గంటల కొద్దీ టైం కేటాయించటం.. అంతే సమయం సోషల్ మీడియా మీద ఫోకస్ చేయటం ద్వారా ఇప్పుడాయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు.
కొందరికి ఇష్టుడిగా.. మరికొందరికి పరమ వీర శత్రువుగా మారిన కత్తి మహేశ్.. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాల్ని అప్డేట్ చేస్తుంటారు. లేటెస్ట్ గా జరిగే హ్యాపినింగ్స్ విషయంలో అలెర్ట్ గా ఉండే ఆయన.. ప్రతి కీలకమైన పరిణామంపైనా స్పందించటం ఒక అలవాటుగా చేసుకున్నారు.
తాజాగా ఏపీ కేబినెట్ నుంచి తప్పుకున్న మంత్రి కామినేని శ్రీనివాస్ పై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అంతకు మించి.. మరో ఆసక్తికర పోస్టును కత్తి చేశారు. తన దృష్టిలో నలుగురే నిజమైన హీరోలుగా చెప్పారు. కత్తి కంటికి నిజమైన హీరోలుగా నిలిచిన వారెవరంటే.. సంపూర్ణేశ్ బాబు.. నిఖిల్ గా చెప్పారు.
అక్కడితో ఆగితే ఆయన కత్తి ఎందుకు అవుతారు. ఇద్దరు సినీ జీవులతోపాటు.. ఏపీ ప్రత్యేకహోదాపై ఇప్పటివరకూ స్పందించిన శివాజీ.. పవన్ కల్యాణ్ మినహా ఏ హీరో కూడా నిజజీవితంలో ప్రజల కోసం కనీసం ఒక మాట.. ఒక ట్వీట్.. ఒక ఉద్యమ అడుగు వేయలేదని.. ప్రస్తుతానికి తన దృష్టిలో ఆ నలుగురే నిజమైన హీరోలేనని తేల్చేశారు. కత్తి ట్వీట్ అంటేనే మండిపడే పవన్ ఫ్యాన్స్ కు.. తాజా ట్వీట్ కాస్తంత ఉపశమనం కలిగించటం ఖాయం.
ఇదిలా ఉంటే.. పార్టీ ఆదేశించటంతో తప్పనిసరి పరిస్థితుల్లోఏపీ మంత్రిగా తన పదవికి రాజీనామా చేసిన కామినేనిపై కత్తి రియాక్ట్ అయ్యారు. శ్రీ కామినేనిగారి రాజీనామాతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు కొరికి పసికందులు మరణించిన వైభవ శకం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య రంగంలో ముగిసిందని తాను భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మొత్తానికి కామినేని వారికి వేసిన కత్తి పంచ్ అదిరిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.