ఆసక్తికర రాజకీయ పరిణామాలకు వేదికగా మారింది ఏపీ. రాజకీయ పార్టీల మధ్య హోదా వ్యవహారం అంతకంతకూ ముదురుతోంది. ఏపీ ప్రజల సెంటిమెంట్‌ను ఏకీకృతం చేయటంలో జగన్ చేసే ప్రయత్నం జగన్ చేస్తే..ఆ విషయంలో అధికారపార్టీని ఉద్యమ ముగ్గులోకి దించటంలో పవన్ సక్సెస్ అయ్యారు. దీంతో.. ఇప్పుడు ఏపీ రాజకీయ పార్టీలన్నీ హోదా మీద మాట్లాడుతున్నాయి.
ఇలాంటివేళ.. శత్రువులు మిత్రులుగా.. మిత్రులు శత్రువులుగా మారుతున్న చిత్రమైన దృశ్యం ఆవిష్కృతమవుతోంది. నిన్నటి వరకూ పవన్ పేరెత్తితేనే కత్తి దూసే కత్తి మహేశ్.. ఇప్పుడాయనకు దన్నుగా నిలుస్తున్నారు. అదేసమయంలో.. అనుభవం పేరుతో బాబుకు అండగా నిలిచిన పవన్.. తమ్ముళ్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఇంతకాలం తమకు వత్తాసుగా నిలిచిన పవన్ గళం మారినంతనే తమ్ముళ్ల తీరు మారిపోయింది.
వెనుకా ముందు చూసుకోకుండా.. పవన్ తప్పు ఉందా? లేదా? అన్నది పట్టించుకోకుండా తిట్టటమే ధ్యేయమన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో.. కత్తి లాంటోళ్లకు సైతం కోపం వస్తోంది. పవన్ ను అంతగా ఆడిపోసుకుంటారా? ముందు మిమ్మల్ని అనాల్సిందంటూ వారిపై ఫైర్ అయిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
పవన్ ను వెరైటీ.. వెరైటీగా విమర్శలు చేసే కత్తి మహేశ్.. ఈసారి అందుకు భిన్నంగా ఎప్పుడూ పవన్ ను అలా అంటే ఎట్లా? అంటూ వెనకేసుకొచ్చారు. బీజేపీతో వ్యభిచారం చేసింది మీరేనంటూ టీడీపీని తప్పు పట్టారు.
ఈ సందర్భంగా అమెరికా రాజకీయ వ్యూహాన్ని ఒకటి చెప్పుకొచ్చారు. అమెరికా తనకు మద్దతు ఇవ్వని ఎవరినైనా సరే.. టెర్రరిస్టులుగా ముద్ర వేస్తుందని.. టెర్రరిజం పేరుతో భయపెట్టి.. వారిని తన దారికి తెచ్చుకుంటుందని.. ఇదే తీరులో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందన్నారు.
మాతో రాకపోతే బీజేపీ ఏజెంట్లు అన్న ముద్ర వేస్తామని టీడీపీ నేతలు అంటున్నారని.. బీజేపీతో వ్యభిచారం చేసింది మీరు అంటూ తమ్ముళ్లపై విరుచుకుపడ్డారు. పవన్ ను.. జగన్ ను బీజేపీతో లింకు పెడితే ఎట్లా? అంటూ ప్రశ్నించారు. మొత్తానికి పవన్ స్వరం మారినంతనే.. కత్తి లాంటోళ్లు పవన్ కు సరికొత్త ఆయుధాలుగా మారతామన్న విషయాన్ని మహేశ్ తన తాజా ట్వీట్ తో స్పష్టం చేశారని చెప్పాలి.