సినీ క్రిటిక్ కత్తి మహేశ్ కొత్త తరహాను ప్రదర్శించారు. నిన్నమొన్నటి వరకూ సోషల్ మీడియాలోనూ.. కొన్ని టీవీ ఛానళ్ల స్టూడియోలలో కూర్చొని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను తప్పు పడుతున్న వైనం తెలిసిందే. పవన్ ను ప్రతి విషయంలోనూ తప్పు పట్టే కత్తి తాజాగా ఊహించిన రీతిలో వ్యవహరించారు. పవన్ ను తప్పు పడుతూ.. ఆయనపై అదే పనిగా విమర్శలు చేస్తున్న వేళ.. పవన్ తరఫున పలువురు సినీ ప్రముఖులు మద్దతుగా నిలిచారు.
ఇలాంటి వేళ.. కత్తి మహేశ్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఉస్మానియా జేఏసీ కత్తికి తన మద్దతు తెలిపింది. కత్తిపై పవన్ అభిమానులు కానీ దాడి చేస్తే.. చూస్తూ ఊరుకోనివ్వమని హెచ్చరించింది. కత్తిపై దాడి జరిగిన పక్షంలో పవన్ ను తెలంగాణలో తిరగనివ్వమని జేఏసీ విద్యార్థులు వార్నింగ్ ఇచ్చారు.
ఉస్మానియాకు వెళ్లిన కత్తిని చూసిన అక్కడి విద్యార్థులు.. పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో పేరుతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడిన కత్తి మహేశ్.. పవన్ తన అభిమానులను వేరే పార్టీలకు అమ్ముకుంటున్నట్లు ఆరోపించారు.
తనపైకి అభిమానుల్ని పవన్ ఉసిగొల్పుతున్నారన్నారు. తన అభిమానుల్ని పవన్ అదుపులోకి పెట్టుకోవాలన్నారు. ఇంతకాలం ట్వీట్లతోనూ.. మెసేజ్ లతోనూ.. టీవీ షోలతో తన మాటలతో వేడెక్కించే కత్తి.. ఇప్పుడు ఓయూ విద్యార్థుల జేఏసీతో కలవటం ఆసక్తికరంగా మారటమే కాదు.. తెలంగాణ ఉద్యమ కాలంలో మాదిరి ఓయూ జేఏసీ విద్యార్థులు వార్నింగ్ ఇవ్వటం గమనార్హం.