జనసేన నుంచి ఓపెన్‌ ఆఫర్‌: కత్తి మహేశ్‌

Update: 2019-01-07 11:44 GMT
హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ నగర బహిష్కరణ ఆదేశాల తర్వాత దాదాపు కన్పించకుండా పోయిన కత్తి మహేశ్‌.. చాన్నాళ్ల తర్వాత తిరుపతిలో మీడియా ముందుకు వచ్చాడు. నగర బహిష్కరణ వల్ల తనకు చాలా మేలు జరిగిందని చెప్పుకొచ్చాడు. ఈ సమయంలో విశాఖ నుంచి అనంతపురం వరకు అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజల స్థితి గతులు తెలుసుకున్నాని చెప్పాడు.

       తిరుపతిలో కళాకారులకు అన్యాయం జరుగుతుందని.. బయటి నుంచి వచ్చేవారిని పట్టించుకుంటున్న టీడీపీ.. స్థానికంగా ఉండే కళాకారులకు అన్యాయం చేస్తుందని విమర్శించాడు కత్తి. ఈ ప్రెస్‌ మీట్‌ లో జర్నలిస్ట్‌ లు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించిన కత్తి మహేశ్‌.. తనకు టీడీపీ - వైసీపీ - జనసేన నుంచి ఓపెన్‌ ఆఫర్‌ ఉందని ప్రకటించాడు.

మూడు పార్టీల నుంచి ఓపెన్‌ ఆఫర్‌ ఉందని ప్రకటించాడు సరే.. మరి కత్తి మహేశ్‌ ఏ పార్టీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నాడు అంటే.. వైసీపీ అనే సమాధానం విన్పిస్తుంది. టీడీపీ చేస్తున్న అభివృద్ధి మాటలకే పరిమితం అయ్యిందని.. అమరావతి - విజయవాడ వెళ్తే తనకు మొత్తం అర్థం అయ్యిందని చెప్పాడు. అంటే.. ఇన్‌ డైరెక్ట్‌ గా టీడీపీలోకి వెళ్లను అని చెప్పేశాడు. ఇక జనసేన - పవన్‌ కల్యాణ్‌ తో ఉన్న గత మధురస్మృతుల వల్ల.. ఎంత ఓపెన్‌ ఆఫర్‌ ఉన్నా వెళ్లకపోవ్చచు. సో.. ఎలాచూసినా కత్తి మహేశ్‌ కున్న ఏకైక ఆప్షన్‌ వైసీపీనే.


Full View


Tags:    

Similar News