కేంద్రం లెక్కలు, రాష్ర్టం బొక్కలు అన్నీ తేలుస్తానంటూ నిజ నిర్ధారణ సంఘం వేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆయన ఆస్థాన విమర్శకుడు కత్తి మహేశ్ మళ్లీ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆయన పవన్ చెబుతున్న ‘జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’(JFC) పేరును, లోగోను మార్చి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అది జస్ట్ ఫర్ ఫన్ కమిటీ అంటూ కొత్త అబ్రివేషన్ ఇచ్చారు.
కాగా కత్తి ఈ ట్వీట్ చేసిన పది నిమిషాల్లోనే సుమారు 60 మంది లైక్ చేయగా దాదాపు అంతే సంఖ్యలో కామెంట్లూ వచ్చాయి. అందులో కత్తి తీరును తప్పు పడుతూ ఎక్కువ మంది కామెంట్లు చేశారు. ఇంతవరకు కత్తి మహేశ్ బాగా విమర్శిస్తారనే అభిప్రాయంతో ఉండేవాడినని... కత్తి ఫొటోలను జంతువులతో మార్ఫింగ్ చేసే ఆయన వ్యతిరేకులకు, ఇప్పుడు పవన్ లోగోను మార్ఫింగ్ చేసిన కత్తికి తేడా లేకుండా పోయిందని, ఆయన్నుంచి ఇలాంటివి ఆశించడం లేదని, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలంటూ సత్యార్థి అనే ఒక యూజర్ కామెంట్ చేశారు.
ఇక కత్తి పేరు చెబితేనే మండిపడే బ్యాచ్ ఎప్పట్లా దారుణంగా తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆయన్ను టీవీ చానళ్లలో చర్చకు రమ్మంటూ సవాల్ విసురుతున్నారు. మరోవైపు కత్తి మార్ఫింగ్ చేసి ట్వీట్ చేసిన ఈ జేఎఫ్ సీ ఇమేజ్ వాట్సాప్‌లతో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. మొత్తానికి కత్తి ఈ రోజు మరోసారి పవన్ ను టార్గెట్ చేసి ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. చూడాలి మళ్లీ, ఇదెక్కడికి దారితీస్తుందో.