కత్తి మహేష్.. పవన్ ను వదలట్లేదుగా

Update: 2018-03-29 11:15 GMT
గతంలో పవన్ కళ్యాణ్ అభిమానులకు.. కత్తి మహేష్ కు మధ్య తీవ్ర స్థాయిలో సాగిన గొడవ ఒక దశలో ఓ కొలిక్కి వచ్చి ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరిన విషయం తెలిసిందే. ఆ ఒప్పందం తర్వాత ఇరు వర్గాలు కొంత సంయమనం పాటించాయి. పవన్ మీద వ్యక్తిగత విమర్శలు చేయనని.. కానీ రాజకీయ విమర్శల విషయంలో మాత్రం తగ్గేది లేదని చెప్పిన కత్తి.. ఆ తర్వాత కొంచెం స్వరం తగ్గించారు. సంయమనంతో వ్యవహరిస్తూ వచ్చారు. ఒక దశలో పవన్ ను పొగిడే ప్రయత్నం కూడా చేశారు. కానీ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగి.. వివిధ అంశాలపై అస్పష్టతతో మాట్లాడుతుండటం.. గందరగోళం సృష్టిస్తుండటంతో కత్తి మళ్లీ ఆయన్ని గట్టిగా తగులుకుంటున్నాడు.

ఇటీవలే పవన్ మీద కత్తి విమర్శలు బాగా పదునెక్కుతున్నాయి. జనసేనలో కీలకంగా వ్యవహరించి చివరికి ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన దిలీప్ కళ్యాణ్ సుంకర విషయంపై జాలి పడుతూ నిన్న జనసేన మీద తీవ్ర విమర్శలు గుప్పించాడు కత్తి. ఇప్పుడు మరోసారి పవన్ ను లక్ష్యంగా చేసుకున్నాడతను. వామపక్షాలతో ప్రత్యేక హోదా గురించి పవన్ చర్చిస్తుండటంపై ఆయన తనదైన శైలిలో స్పందించాడు.

‘‘మరోసారి వామపక్షాలతో.. పార్టీ నాయకులతో (?).. కార్యకర్తలతో ప్రత్యేక హోదా గురించి చర్చించడానికి సిద్ధమైన పవన్ కళ్యాణ్. 4.. 5.. 6 తారీఖుల్లో విజయవాడ రానున్నారు.

ఒకటో సారి!

రెండో సారి!!

మూడో సారి!!!

మరోసారి!

ఇంకోసారి!

ఆపైన.. ప్రతిసారీ!!!

చివరికి సారీ సారీ’’

అంటూ సెటైరిగ్గా ట్వీట్ పెట్టాడు కత్తి. నాయకులు అనే చోట బ్రాకెట్లో ఆశ్చర్యార్థకం పెట్టడంతోనే కత్తి వ్యంగ్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Tags:    

Similar News