రాజకీయాల్లో ఒక్కోసారి ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టం. అది జరిగిన తర్వాత ఆశ్చర్యపోవడం మాత్రమే మనవంతు. ఇప్పుడు అలాంటిదో మరోటి జరిగింది. బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని కలిశారు. ఈ సమయంలో కౌశల్ తో పాటు మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. అయితే.. దీనిపై అటు కౌశల్ కానీ, ఇటు టీడీపీ కానీ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపునుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు కౌశల్ ఆసక్తి చూపిస్తున్నారని అందుకే చంద్రబాబుతో భేటీ అయ్యారని వార్తలు విన్పిస్తున్నాయి.
మరోవైపు చంద్రబాబుని కౌశల్ కలవడం వెనుక మరో మంత్రాగం కూడా ఉందని గుసగుసలు విన్పిస్తున్నాయి. రీసెంట్‌గా కౌశల్ ఆర్మీ సభ్యులు కౌశల్‌పై తిరుగుబాటు చేశారు. ఫౌండేషన్ పేరుతో వసూలైన డబ్బులన్నీ కౌశల్ తన సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపణలు చేశారు. అయితే.. తనకు ఎవ్వరి డబ్బులు అవసరం లేదని, తనీష్ - బాబు గోగినేని కౌశల్ ఆర్మీని రెచ్చగొట్టి తనపై ఉసిగొల్పారని ఆరోపించాడు కౌశల్. దీనిపై తనీష్ సీరియస్ అయ్యాడు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించాడు. రెండు రోజుల తర్వాత తనీష్.. మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు. దీంతో.. కౌశల్‌ని ఇండస్ట్రీలో లేకుండా చేసేందుకు తనీష్ మెగాస్టార్ ని కలిశారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో కౌశల్ చంద్రబాబుని కలిసి సాయం అడిగారని..పనిలో పనిగా టీడీపీలో చేరి ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే.. ఇంతవరకు అధికారికంగా చంద్రబాబుతో కౌశల్ భేటీపై ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు కౌశల్ పై గుర్రుగా ఉన్న కౌశల్ ఆర్మీ.. ఆయనకు ఎక్కడనుంచి పోటీ చేసినా చిత్తుచిత్తుగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటి టైమ్ లో కౌశల్ కు టీడీపీ టిక్కెట్ ఇస్తుందా అంటే.. వేచి చూడాల్సిందే.