కర్ణాటక.. తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన కావేరీ జలాల ఇష్యూ గురించి తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో ఇరు రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దారుణమైన హింసాకాండ జరిగింది. ఇదంతా అందరికి తెలిసిన నిజం. దీనికి వెనుక మరో నిజం ఉంది. అంది అందరికి తెలీదు. విషయాల్ని లోతుగా చూసే వారికి మాత్రమే కనిపిస్తుంది. ఇంతకీ ఆ చేదు నిజం ఏమిటంటే.. ప్రజల భావోద్వేగాల్ని ఇంతలా ప్రభావితం కావటానికి తమిళనాడు.. కర్ణాటకకు చెందిన న్యూస్ ఛానళ్లు కొన్ని వెబ్ సైట్లుగా తేల్చారు. చూపించిన క్లిప్పింగ్ నే పదే పదే చూపిస్తూ.. వార్తలకు కాసింత మసాలా యాడ్ చేయటంతో ఎమోషన్స్ హై పిచ్ కి వెళ్లాయి. దీంతో.. ఊహించని రీతిలో విధ్వంసం చోటు చేసుకుంది.
ఈ రెండు రాష్ట్రాల్లో ఛానళ్లు వ్యవహరించిన వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తటమే కాదు.. కేంద్రం కూడా సీరియస్ అయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆచితూచి వ్యవహరించాని తొందరపడకూడదంటూ హెచ్చరికలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇలాంటి తప్పునే తెలుగు న్యూస్ ఛానళ్లు.. కొన్ని వెబ్ సైట్లు చేశాయి.శుక్రవారం తెల్లవారుజామున పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ అయిన కావేరీ ట్రావెల్స్ కు చెందిన ఒక బస్సు (షిర్డీ – హైదరాబాద్) కర్ణాటకకు దగ్గరల్లోని హుమ్నాబాద్ దగ్గర దగ్థమైంది.
సాంకేతిక లోపం కారణంగా దగ్థమైందా? ఎవరైనా కుట్రపూరితంగా దగ్థం చేశారా? అన్న ప్రశ్నల్ని వేసుకునే కన్నా.. కర్ణాటక సరిహద్దుల్లో జరిగిన ఈ ఉదంతాన్ని సంచలన అంశంగా మార్చేశారు. కావేరీ జలవివాదం నేపథ్యంలో పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ కు ఉన్న బస్సును ఆందోళనకారులు తగలబెట్టేశారని.. ఇద్దరు సజీవదహనం అయ్యారని.. ఈ బస్సులో తెలుగువాళ్లే ఎక్కువంటూ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేశారు. సున్నితమైన ఈ వ్యవహారంలో నిజనిజాలేమిటి? సంబంధిత పోలీసుల వర్గాల్ని సంప్రదించటం.. వారి వివరణ తీసుకోవటం.. ప్రత్యక్ష సాక్ష్యుల్ని వివరాలు అడగటం లాంటివి సరిగా చెక్ చేయకుండానే వార్తలు ప్రసారం చేసేశారు.
ఇలాంటి వార్తల వల్ల రెండు ప్రాంతాల మధ్య భావోద్వేగాలు మరింత పెరిగి.. లేనిపోని ఘటనలు చోటు చేసుకునే వీలుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించకుండానే తమ చేసికి వచ్చిన హాప్ బేక్ డ్ వార్తల్ని టెలికాస్ట్ చేసేశారు. అయితే.. ఈ వ్యవహారంపై కర్ణాటక పోలీసులు సత్వరం స్పందించటం.. జరిగిన దానిలో కావేరీ జలవివాదం ప్రమేయం లేదని తేల్చటంతో.. జరుగుతున్న ప్రచారాన్ని చెక్ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని కొన్ని ప్రముఖ వెబ్ సైట్లు గుర్తించి తప్పును సరిదిద్దుకున్నాయి. టీవీ చానళ్లు సైతం తమను తప్పును డిలీట్ చేసేసి.. బస్సు సాంకేతిక సమస్య కారణంగానే తగలబడిందని.. షార్ట్ సర్క్యూట్ కారణంగా తేల్చారు. ఒకవేళ కర్ణాటక పోలీసులు సత్వరమే స్పందించకుండా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రియాక్ట్ కావటంతో పెద్ద ముప్పు తప్పిందని చెప్పాలి.
పోటీ పేరుతో.. ఎవరికి వారు హడావుడిగా వండి వార్చిన వార్త ఎవరికి వారు వెనక్కి తీసేసుకొని.. అసలేం జరగన్నట్లుగా తమ వార్తల్ని మార్చేసి.. అప్పటివరకూ ఘోరం.. దారుణం అంటూ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిన వారంతా.. ఆ తర్వాత మాత్రం బస్సు ప్రమాదానికి గురైందంటూ వార్తల్ని ప్రసారం చేసి చేతులు దులుపుకున్నారు. తాము చేసిన తప్పును హుందాగా ఒప్పుకొని ఉంటే క్షమించమంటే అదో కొత్త స్ఫూర్తిగా ఉండేది. ఒకవేళ సారీ చెప్పటం ఇష్టం లేకపోతే.. కనీసం జరిగిన దానికి చింతిస్తున్నట్లు చెప్పినా బాగుండేది. కానీ.. అంత విశాల హృదయాన్ని ఆశించటం అత్యశే అవుతుందేమో.