తెలంగాణ వాకిట మరో యుద్ధం ఆరంభం అయింది. ఓవైపు పాలమూరు దళిత బిడ్డలు తమకు అన్యాయం జరిగిందని, తమ భూములు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతామని చెబుతూ, అన్యాయంగా ఎటువంటి నోటిఫికేషన్ లేకుండానే గుంజుకుంటున్నారని వేదన చెందుతుంటే, మరోవైపు తెరపైకి మళ్లీ పసుపు బోర్డ్ వివాదాన్ని తీసుకుని వచ్చారు ఎమ్మెల్సీ కవిత.
సార్వత్రిక ఎన్నికలు జరిగిన మూడేళ్ల తరువాత ఆమె గొంతుక వినిపించడం విశేషం. ఇవాళ ఆమె ప్రెస్మీట్ పెట్టి మరీ ! కొన్ని విషయాలు చెప్పారు.
మళ్లీ ఆమె నిజామాబాద్ నుంచి పోటీ చేసి పరువు పోయిన చోట రాబట్టుకోవాలన్న ఆత్రంతో ఉన్నారని కొన్ని మీడియా కథనాలు నిర్థారణ చేస్తున్నాయి.
మరోవైపు ఎంపీ అరవింద్ ను ఎక్కడికక్కడ ఘెరావ్ చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు ఇప్పటికే సంకేతాలు వెళ్లాయి. అందుకే ఆయన నిరసనలకు సంబంధించి ఏ చిన్నపాటి సమాచారం ఉన్నా అప్రమత్తమై సంబంధిత ప్రాంతానికి వెళ్లడం మానుకుంటున్నారు.
ఇదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియాకు మాత్రం ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు మాత్రం మొగ్గు చూపుతున్నారు. అవసరం అయితే తాము రాజ్యాంగాన్ని మారుస్తామని అంటూ, సెక్యులర్ అన్న పదాన్ని కూడా తొలగిస్తామని అంటున్నారు.
అంటే విద్వేష పూరిత వ్యాఖ్యలతోనే ఆయన రాజకీయంగా నెగ్గుకు రావాలనుకుంటున్నారే తప్ప ప్రజా సమస్యలపై పోరు మాత్రం చేయరన్నది తేలిపోయిందని, ఈ వాస్తవాన్ని ప్రజలు గుర్తించి, మంచి వ్యక్తులకే ఓటు వేయాలని విపక్ష నేతలను ఉద్దేశించి అధికార పార్టీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు.