ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితను బుక్ చేయాలనుకుంటున్న బీజేపీకి గట్టిగా ఎదురు నిలవడానికి ఆమె రెడీ అయ్యారు. బీజేపీకి సవాల్ చేయడానికి కవిత పూనుకున్నారు. అరెస్ట్ పై 'మర్యాదగా ఉండదు' అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్ తర్వాత కవిత, కేజ్రీవాల్ టార్గెట్ అని వార్తలు వస్తున్నాయి. కవిత జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు నోరుపారేసుకుంటున్నారు.
ఇప్పటికే కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు , సన్నిహితులుగా పేరున్న బోయినపల్లి అభిషేక్ రావు, శరత్ చంద్రారెడ్డిలను అరెస్ట్ చేశారు. కవిత అరెస్ట్ తప్పదని బీజేపీ నేతలు కొన్నిరోజులుగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై కవిత సీరియస్ గా స్పందించారు.
విపక్ష నేతలను దేశంలోని దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయని.. ఏ ఏజెన్సీ ఎప్పుడు అరెస్ట్ చేయాలో బీజేపీ నేతలే చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు చెబితే నన్ను అరెస్ట్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు. అరెస్ట్ లు అనేవి ఏజెన్సీలు చేయాలని.. అందుకు భిన్నంగా బీజేపీ నేతలు దిశానిర్ధేశం చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మాత్రం దానికి కేంద్ర ఏజెన్సీలు ఎందుకని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు దిగితే బీజేపీ వారికి మర్యాద దక్కదని మీడియా ముఖంగా హెచ్చరించారు.
దీంతో తన అరెస్ట్ విషయంలో కవిత క్లారిటీగా ఉన్నట్టు తెలుస్తోంది. అరెస్ట్చేస్తే సానుభూతి గేమ్ బీఆర్ఎస్ కే వచ్చే ఛాన్స్ ఉంది. కొన్ని వారాలుగా జాతీయ అంశాలపైనే కవిత ఫోకస్ చేసి మరీ కేంద్రాన్ని నిలదీస్తున్నారు. మోడీ, బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. అదానీ, హిండెన్ బర్గ్ రిపోర్ట్, ప్రైవేటీకరణపై కడిగేస్తున్నారు. మహిళా బిల్లు కోసం పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని మార్చి 10న ఢిల్లీలో దీక్షకు రెడీ అయ్యారు. తనను కక్ష గట్టి అరెస్ట్ చేస్తున్నారని కవిత నిరూపించుకునేందుకే ఇలా చేస్తున్నారని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.