రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందన్న పెడబబ్బలకు ప్రతిగా రాష్ట్ర విభజన జరిగిపోయింది. 60 ఏళ్లలో తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందన్న దానికి బదులుగా అన్నట్లు.. ఏపీకి పూర్తిగా అన్యాయం చేస్తూ విభజన చేసేశారు.
చేతిలో రూపాయి లేకుండా.. ఖాళీ బక్కసాన్ని పెట్టేసి.. మీ రాజ్యం మీరు పాలించుకోడంటూ కేంద్రం చట్టం చేసి పారేస్తే.. ఏ నెలకు ఆ నెల ఉద్యోగుల జీతానికి సైతం నాలుగు రాళ్లు వెతుక్కునే దుస్థితి.
ఇదిలా ఉంటే.. ఇప్పుడున్న పంచాయితీలు సరిపోనట్లు తాజాగా మరో పంచాయితీని తెలంగాణ ఎంపీ కవితమ్మ తెర మీదకు తీసుకొచ్చారు. ఏపీకి ఎంతోకొంత మేలు చేస్తుందని భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో ఫిట్టింగ్ పెట్టేశారు. పోలవరం ప్రాజెక్టుకు కానీ జాతీయ హోదా వచ్చిన పక్షంలో ఎస్‌ఎల్‌బీసీ కింద 30 టీఎంసీల నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రాకు నీరు ఇచ్చేందుకే పులిచింతల ప్రాజెక్టు చేపట్టారని.. జూరాల ఆయుకట్టు కింద రైతులకు అన్యాయం జరుగుతోందని విమర్శిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. విభజనకు ముందు గడిచిన పదేళ్లలో కాంగ్రెస్ సర్కారు అధికారంలో ఉన్నప్పటికీ.. తెలంగాణకు అన్యాయం చేసింది మాత్రం చంద్రబాబేనని తేల్చిన ఆమె.. ఇప్పుడు పోలవరం నీటిలో వాటా అడగటం చూస్తుంటే.. రానున్న రోజుల్లో 60 ఏళ్లు కలిసి ఉన్న దానికి బదులుగా.. మరో 600 ఏళ్లు ఏపీ సర్కారు తెలంగాణకు నష్టపరిహారం ఇవ్వాలన్న డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాన్ని కొందరు సీమాంధ్ర మేధావులు వ్యక్తం చేస్తున్నారు.