కాస్త ఆలస్యమైనా..కొన్ని నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. చేతిలో అధికారం ఉంది కదా అని ఎడాపెడా నిర్ణయాలు తీసుకుంటే.. భవిష్యత్తులో ఆ నిర్ణయాలు శాపాలుగా మారతాయి. దీనికి నిలువెత్తు నిదర్శనంగా టీడీపీ అధినేత చంద్రబాబు కనిపిస్తారు. తన చేతిలో అధికారం ఉన్నంతనే ఆయన తీసుకునే నిర్ణయాలు.. తర్వాతి కాలంలో ఆయనకు ఎలాంటి ఇబ్బందులుగా మారతాయన్నది తెలిసిందే.
తాజాగా తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ సీట్లను భర్తీ చేయటం.. అందులో ఒకటి సీనియర్ నేత కేకేకు.. మరో సీటు ఉమ్మడి ఏపీలో స్పీకర్ గా వ్యవహరించిన సురేశ్ రెడ్డి ని ఎంపిక చేస్తూ టీఆర్ఎస్ అధినేత కమ్ సీఎం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. వాస్తవానికి ఈ రెండు ఖాళీల్లో ఒక దానికి తనకు ప్రాణ సమానమైన కుమార్తె కవితకు కేటాయిస్తారన్న ప్రచారం జరిగింది. సీఎం కేసీఆర్ ఆలోచనలు.. వ్యూహాల గురించి తెలిసిన వారు మాత్రం కవితకు ఛాన్సు ఇవ్వక పోవటంపై ఎలాంటి ఆశ్చర్యానికి గురి కావటం లేదు.
కవిత కెరీర్ విషయంలో కేసీఆర్ అప్రమత్తంగా ఉండటమే కాదు.. తాను తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఉండాలన్నట్లుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికల బరిలో దిగి.. గెలిచిన హిస్టరీ నేపథ్యంలో.. అందుకు భిన్నంగా నామినేట్ చేసి పెద్దల సభకు పంపటం ద్వారా.. ఆమె ఇమేజ్ ను డ్యామేజ్ చేసినట్లు అవుతుందన్న ఆలోచన లో ఉన్నట్లు చెప్పక తప్పదు.
రాజ్యసభకు కవితను పంపితే.. కేసీఆర్ పై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగేవి. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యేది. వేళ్లు చూపించేటోళ్లు.. ఉచిత సలహాలు ఇచ్చేటోళ్లు మస్తుగా బయటకు వచ్చేవారు. అయితే.. అలాంటి వాటిని కేసీఆర్ ఎన్ని చూసి లేదు. కాకుంటే.. కవితను ఎంపిక చేయటం ద్వారా ఆమె పొలిటికల్ కెరీర్ కు జరిగే నష్టమే ఎక్కువ.
తండ్రి సీఎం అయినప్పుడు కూతుర్నిరాజ్యసభ కు పంపటం పెద్ద విషయం కాదన్న భావన కలుగ జేయటం.. కవిత పేరు ప్రఖ్యాతులకు.. గౌరవ మర్యాదలకు ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు. అందుకే.. కవితకు ఛాన్సు ఇవ్వలేదంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తప్పించి.. పరోక్ష ఎన్నికల్లో కవిత దిగే అవకాశం లేదని.. అనూహ్య పరిణామాలు తప్పిస్తే.. అన్ని మామాలుగా ఉంటే మాత్రం నాలుగేళ్ల తర్వాత జరిగే ప్రత్యక్ష ఎన్నికల్లోనే ఆమెను బరిలోకి దింపుతారని అంటున్నారు. అంతే తప్పించి.. నామినేటెడ్ పదవి ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తును అందించిన కేసీఆర్.. తన కుమార్తె విషయాన్ని మరెంత పట్టించుకుంటారు? ఇంకెత జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు చెప్పండి?