మొదలైన కవిత విచారణ!

Update: 2023-03-11 12:39 GMT
కల్వకుంట్ల కవిత సరిగ్గా ఉదయం 11 గంటలకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆఫీలోకి అడుగుపెట్టారు. ఏదో ముహూర్తం చూసుకున్నట్లుగా ఉంది కవిత వ్యవహారం. ఉదయం నుండి కవిత ఇంటి దగ్గర విపరీతమైన ఒత్తిడి మొదలైంది. మంత్రులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కవిత ఇంటిదగ్గరకు ఉదయాన్నే చేరుకున్నారు. అన్న, మంత్రి కేటీఆర్, బావ, మంత్రి అయిన హరీష్ రావు దాదాపు మూడుగంటలపాటు ఇంట్లోనే కవితతో భేటీ అయ్యారు.

న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపి, విచారణలో ఎలా వ్యవహరించాలి ? ఈడీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేసే అవకాశముంది ? దానికి సమాధానాలు చెప్పాల్సిన విధానంపై ముగ్గురు మాట్లాడుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. గంటలపాటు భేటీ తర్వాత కవిత తన భర్త, న్యాయనిపుణులతో ఈడీ ఆఫీసుకు రెండు కార్లలో బయలుదేరారు. అయితే ఆఫీసు దగ్గర భర్త అనీల్, న్యాయనిపుణులను ఈడీ సెక్యూరిటి బయటే నిలిపేశారు. దాంతో కవిత ఒక్కళ్ళు మాత్రమే ఆఫీసులోకి వెళ్ళారు.

ఈడీ ఆఫీసులోకి ఎంటరయ్యే ముందు కవిత బయట వెయిట్ చేస్తున్న నేతలు, కార్యకర్తలందరీ అభివాదం చేసి, చేతులూపి మరీ ఆఫీసులోకి ఎంటరయ్యారు. కవితను విచారించబోతున్న ఈడీ ఉన్నతాధికారులు ఇఫ్పటికే అరుణ్ రామచంద్రపిళ్ళై, మనీష్ సిసోడియాను కూడా  ఆఫీసుకు పిలిపించుకున్నారు. వీళ్ళ ముగ్గరినీ కాన్ఫ్రంటేషన్ ఎంక్వయిరీ పద్దతిలో విచారించే అవకాశముందని సమాచారం. అంటే ముగ్గురిని వేర్వేరు గదుల్లో ఉంచి ఒకే ప్రశ్నను వేస్తారు. దానికి వీళ్ళ ముగ్గురు ఇచ్చే సమాధానాలను రికార్డు చేస్తారు. దీనివల్ల ముగ్గరు ఒకరేరకమైన సమాధానాలు ఇచ్చారా లేకపోతే వేర్వేరు సమాధానాలు ఇచ్చారా అన్నది తేలిపోతుంది.

సమాధానాలు ఒకటే అయితే విచారణ మరోపద్దతిలోకి మారుతుంది. సమాధానాలు వేర్వేరుగా ఉంటే ఆ సమాధానాల మీదే మరింత లోతుగా విచారణ చేస్తారు. మొత్తానికి కవితను ఈడీ విచారించటమన్నది ఇపుడు దేశవ్యప్తంగా పెద్ద ఇష్యు అయిపోయింది. దర్యాప్తుసంస్ధలను కేందరప్రభుత్వం ప్రతిపక్షాల నేతలపైకి ఉసిగొల్పుతోందని దేశంలోని చాలా పార్టీలు గోలచేస్తున్నాయి. ప్రతిపక్షాల నేతల మీదున్న ఆరోపణల్లాంటివే బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏ మీదకూడా ఉన్నప్పటికీ దర్యాప్తుసంస్ధలు వాళ్ళజోలికి మాత్రం వెళ్ళటంలేదు. ఇక్కడే ప్రతిపక్షాలపై కక్షసాధింపులు, వేధింపులనేది బాగా చర్చనీయాంశమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News