టీఆర్ ఎస్ నాయకురాలు - నిజామాబాద్ ఎంపీ కవిత తన తండ్రి - సీఎం కేసీఆర్ కు తగిన వారసురాలనటంలో ఎలాంటి సందేహం లేదు. సందర్భానుసారం మాట్లాడటంలో పేరొందిన కవిత మలేసియాలోని కౌలాలంపూర్ లో మలేసియా తెలుగు ఉగాది సంబరాల్లో ఆశ్చర్యకర కామెంట్లు చేశారు. అన్నింటిలో కలిసి పోయే గుణాలు తెలుగు భాషలో ఉన్నాయని, తెలుగు వాళ్లం కలిసే ఉంటామని ఆమె చెప్పారు. తెలుగు భాష గొప్పదని కవిత చెప్పారు.
మలేషియా ఉగాది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన కవిత తెలుగు భాష విశిష్టతను 'కవిత' రూపంలో వినిపించారు. ఉగాది అంటే ఒక యుగాన్ని ప్రారంభించిన రోజని, బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన పవిత్రమైన రోజు అని అన్నారు. ప్రపంచంలో తెలుగువాళ్లు ఎక్కడున్నా ఉగాది పండుగ రోజు రెండు విషయాలను మరచిపోరన్నారు. ఉగాది పచ్చడిని తయారు చేసి ఆ పచ్చడిని ప్రసాదంగా స్వీకరించడం, మన భవిష్యత్తు - దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు పంచాంగ శ్రవణం చేయడం రెండోది అని చెప్పారు. తెలుగు రాష్ట్రం విడిపోయినా, రెండు రాష్ట్రాల్లో విజన్ ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నారని, వారి సహకారంతో తెలుగుతనాన్ని కాపాడుకుందామన్నారు. మలేషియా ప్రభుత్వం చొరవ చూపి తెలుగువారి పండుగను ఘనంగా నిర్వహించడం చారిత్రాత్మకమన్నారు. తెలుగు సినిమాల్లో విలువలు పడిపోతున్నాయని, ఇంగ్లీషు పదాలను ఎక్కువగా వాడుతున్నారన్నారు. 150 సంవత్సరాల క్రితం మలేసియాకు వచ్చిన వారు చిన్న సంఘాలు పెట్టుకుని భజనలు - కీర్తనలు చెప్పుకుని - పాటలు పాడుకుంటూ బడులు పెట్టుకుని మన భాషను బతికించుకున్నారన్నారు.
ఉద్యమం సమయంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారిలో అగ్రస్థానంలో ఉన్న కేసీఆర్ - కేటీఆర్ - హరీశ్ రావు - కవితల్లో ఒక్క కవిత తప్ప మిగతా వారంతా సీమాంధ్రుల పట్ల తమ వైఖరిని మార్చుకున్నారు. కేసీఆర్ కు పాలకుడిగా అందర్నీ అక్కున చేర్చుకుంటుండగా కేటీఆర్ సీమాంధ్రులతో దోస్తీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. హరీశ్ రావుది సైతం అదో దోరణి. అయితే మొదట్నుంచి విబేధించిన కవిత ఇప్పుడు తెలుగును కీర్తించడం, పైగా విజన్ ఉన్న సీఎం అని పొగడ్తల్లో ముంచేయడం ఆశ్చర్యకరమే.