తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసత్వం గురించి కొత్త చర్చ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా తనయుడు కె తారకరామారావును ఆ పీఠంపై కూర్చోపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారని అంటున్నారు. పార్టీ - ప్రజాప్రతినిధుల్లో ఎలాంటి భిన్నాభిప్రాయాలు - ఎటువంటి అడ్డంకులు-వ్యతిరేకత లేకుండా ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేస్తున్నారని చెప్తున్నారు. ఇందుకు శ్రీకారంగా తన కుటుంబంలోనే ముందు స్పష్టత సాధించేందుకు గాను కుమార్తె కవిత మద్దతు సైతం సమీకరిస్తున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జరిగిన సభలో కవిత చేసిన వ్యాఖ్యలను ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు.
ఆర్మూర్ సభలో కేసీఆర్ తనయ - నిజామాబాద్ ఎంపీ కవిత తన సోదరుడైన కేటీఆర్ ను అనూహ్య రీతిలో పొగిడారు. కేటీఆర్ తన అన్నగా ఉండడాన్ని గర్వపడుతున్నానని చెప్పారు. ఆయన తనకు మాత్రమే అన్న కాదనీ, రాష్ట్ర మహిళలందరికీ అన్నగా బాధ్యతలు తన భుజానికెత్తుకున్నారని కవిత అభివర్ణించారు. మన అందరి సంక్షేమం కోసం ముందుకు సాగుతున్నారని చెప్తున్నారు. కేటీఆర్ అందరికీ అన్నగా కవిత చెప్పడం వెనుక అర్థం ఆయన్ను భవిష్యత్తులో పార్టీ- ప్రభుత్వ రథసారథి అని స్పష్టం చేయడమేనని అంటున్నారు. ఈ క్రమంలో సాగే గ్రౌండ్ వర్క్‌లో ఇదో భాగమనేది రాజకీయవర్గాల విశ్లేషణ. సీఎంగా కేటీఆర్ ను 2019 ఎన్నికల తర్వాత ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అందుకు పార్టీ సభ్యత్వ నమోదు పేరిట జిల్లాల్లో నిర్వహిస్తున్న జనహిత ప్రగతి సభలు ఉపయోగపడుతున్నాయి. దీనిద్వారా కేటీఆర్‌ను భావి తెలంగాణ నేతగా పలువురు ఎమ్మెల్యేలు కీర్తిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ సీనియర్లు సైతం ఆకాశానికెత్తేస్తున్నారు.
మరోవైపు కేటీఆర్ కూడా తనంతట తాను పరిణతి చెందిన నాయకుడిగా ఎదిగేందుకు ఈ సభలను ఉపయోగించుకుంటున్నారని తెలుస్తోంది. అందుకు ఆయన చేస్తున్న ఉపన్యాసాలే ఉదాహరణలు. పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో దైర్యాన్ని నింపుతూ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ప్రజలకు వ్యక్తిగతంగా ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని హామీ ఇస్తున్నారు. ఇప్పుడు కేటాయించిన నిధులతో పాటు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆర్మూర్ లో జరిగిన సభలో స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భావి తెలంగాణ సీఎం అన్నట్టుగానే కేటీఆర్ ను పొగుడుతూ మాట్లాడటం విశేషం. తన నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని కేటీఆర్ ను సభ ద్వారా కోరగా....జీవన్ రెడ్డి కోరిన వెంటనే కేటీఆర్ కూడా హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయిలోనే కేటీఆర్ హామీ ఇవ్వడం ఆసక్తికరం. నిజామాబాద్ మున్సి పాలిటీకి వందకోట్లు, మిగతా అర్బన్ మున్సిపాల్టీలకు 50 కోట్లు చొప్పున ఇస్తామని సభా వేదికగా ప్రకటించడం కొత్త చర్చకు బీజం వేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/