తెలంగాణ వాదం నరనరాన జీర్ణించుకున్న కుటుంబంలోని వ్యక్తి నోట ఈ మాట రావడం ఆశ్చర్యమే. కానీ ఇది వాస్తవం. కేసీఆర్ తనయురాలు కవిత నోటి నుంచి జై ఆంధ్రా నినాదం వచ్చింది. ఐతే ఆమె ఈ మాట అంది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కాదు. అమెరికా గడ్డ మీద. చికాగోలో అమెరికా తెలుగు సంఘం (తానా) వేడుకల్లో పాల్గొన్న ఆమె.. తన ప్రసంగం చివర్లో జై ఆంధ్రా అని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐతే ఆ మాటకు ముందు ఆమె జై తెలంగాణ అని కూడా అందనుకోండి.
ఈ వేడుకలకు హాజరైన ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి కవిత మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరూ కలిసి మెలిసి సాగాలని పిలుపునిచ్చింది. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ ఐకమత్యంతో ఉండాలి. కలిసి సాగాలని.. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి విషయంలో ఏమాత్రం తమ ప్రభుత్వం ఆలస్యం చేయడం లేదని.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి తోడ్పడాలని ఆమె పిలుపునిచ్చింది. ప్రసంగం చివర్లో జై తెలంగాణ.. జై ఆంధ్రా నినాదాలు చేయడంతో ఆహూతుల్లో ఆశ్చర్యం వ్యక్తమైంది. ఎంతైనా తాను తన తండ్రి కేసీఆర్ అంత కఠినం కాదని కవిత రుజువు చేసింది. కేసీఆర్ అండ్ కో ఆంధ్రా వారిపై ఎన్నిసార్లు ఎంతగా విషం కక్కారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.