కారు.. పదహారు అంటూ లోక్ సభ ఎన్నికల ముందు కాన్ఫిడెంట్ గా చెప్పిన టీఆర్ ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన సమాధానం మామూలుగా లేదు. పదకొండు మంది సిట్టింగ్ ఎంపీలకు ఈసారి ఎన్నికల్లో కేవలం తొమ్మిది మాత్రమే సొంతం కావటం గులాబీ బ్యాచ్ కు షాకింగ్ గా మారింది. ఈ ఓటమి అంతా ఒక ఎత్తు అయితే.. నిజామాబాద్ లో సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఓటమిపాలు కావటం సంచలనమైంది.
తన ఓటమిపై కవిత ఇప్పటివరకూ స్పందించింది లేదు. తాజా ఓటమి నేపథ్యంలో హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో ఆమె నిలవనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తన ఓటమి పైనా.. తాను నిజామాబాద్ ను విడిచి వెళ్లనున్న విషయం మీద ఆమె స్పందించారు. తాను ఓడినంత మాత్రాన నిజామాబాద్ ను విడిచిపెట్టి వెళతానా? అంటూ ప్రశ్నిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టి వెళ్లనన్నారు.
ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని.. బంగారు తెలంగాణనే తన లక్ష్యమని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన వారు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు. తానున ఓడినంత మాత్రాన నిజామాబాద్ ను వదిలిపెట్టనని.. అధైర్యపడద్దని కార్యకర్తలకు కవిత పేర్కొన్నారు. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో రెండు అంశాలపై కవిత క్లారిటీ ఇచ్చారని చెప్పాలి.
ఒకటి తాను నిజామాబాద్ ను విడిచి వెళ్లనని చెప్పటం ద్వారా.. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేది లేదన్న విషయం మీద క్లారిటీ ఇచ్చేశారని చెప్పాలి. కవితక్క తమను వదిలివెళ్లిపోతారేమోనన్న ఆందోళనలో ఉన్న నిజామాబాద్ గులాబీ బ్యాచ్ కి ఆమె తాజా వ్యాఖ్యలు మనోధైర్యాన్ని ఇవ్వటం ఖాయం.