జగిత్యాల జిల్లా రాజకీయం భవిష్యత్తులో రసవత్తరంగా మారనుంది. జిల్లా కేంద్ర నియోజకవర్గంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగిత్యాల జిల్లాపై బీజేపీ రాష్ట్ర నేతలు గానీ, ఎంపీ అర్వింద్ గానీ దృష్టి సారించడంలేదనే ఆరోపణ వినిపిస్తోంది. కేవలం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంపీ గెలిచినా పార్టీ పటిష్టం కాలేదు. రాష్ట్ర రాజకీయాల్లో జగిత్యాల సీటు ప్రత్యేక స్థానం పొందింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి సంజయ్ విజయం సాధించారు.
కాంగ్రెస్ సీనియర్‌నేత జీవన్ రెడ్డి ఓటమి పాలవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ పట్టభద్రుల స్థానాన్ని భారీ మెజార్టీతో సాధించుకున్నారు జీవన్‌రెడ్డి.
టీఆర్ఎస్‌లో ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య పోరు ఎమ్మెల్యే సంజయ్‌కు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం నియోజకవర్గ పర్యటనలకు, నిరసనలకు మినహా పార్టీ బలోపేతంపై దృష్టిసారించకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారనుంది.
అయితే సంజయ్ కుమార్ ఈసారి టీఆర్‌ఎస్ టికెట్ రాదనే ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గం లోని ఇద్దరు ముఖ్య నేతలు తామే ఎమ్మెల్యే అభ్యర్ధులమని ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత జగిత్యాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేత ఎల్. రమణ టీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన కూడా జగిత్యాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగవచ్చని అంచనా వేస్తున్నారు.
ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నారని టాక్. బీజేపీ సైతం ఉనికి పోరాటాలకే పరిమితం అయ్యిందని రాజకీయ విశ్లేషకుల వాదన. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ గెలిచాక జగిత్యాల కూడా అందులో ఉండటంతో కొంత జోష్ పెరిగినా వర్గ విభేదాలు ఎక్కువయ్యాయి.
దీంతో ఇక్కడ కవిత తన సొంత హవా పెంచుకుంటున్నారని పార్టీలో వాదన వినిపిస్తోం ది. ఈ నేపథ్యంలో ఆమె ఇక్కడ నుంచి పోటీ చేయడం ఖాయమని.. గెలుపు గుర్రం ఎక్కి అసెంబ్లీలో అడుగు పెడతారని.. టీఆర్ ఎస్‌లో కవిత మద్దతు దారులు అంతర్గత చర్చల్లో చెప్పుకోవడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.