అదిపోయే ఫీచర్స్ తో కవాసకి న్యూ బైక్.. ధర ఎంతంటే?

Update: 2021-11-01 01:30 GMT
జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం కవాసకి కంపెనీ బైక్ ప్రియుల కోసం ఓ న్యూ మోడల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. కరోనా సంక్షోభంతో తీవ్రమైన నష్టాలను చవి చూసిన కవాసకి... వినియోగదారులను మెప్పించేలా సూపర్ ఫీచర్స్ తో ఈ బైక్ ను రూపొందించింది. అదిరిపోయే లుక్ లో ఉన్న న్యూ మోడల్ కవాసకి MY22 Z650RS అనే పేరుతో ఇటీవలె లాంచ్ చేసింది. ఈ బైక్ ను బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇటీవలె విడుదలైన ఈ వాహనానికి బైక్ ప్రియుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. బైక్ రైడర్లను ఆకట్టుకునేలా రూపొందించిన కవాసకి కొత్త మోడల్ కొనుగోళ్లు భారీ స్థాయిలో జరుగుతాయని ఆ సంస్థ ప్రతినిధులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

జపనీస్ టూవీలర్ దిగ్గజం కవాసకి సరికొత్త బైక్ ను 650 సీసీతో రూపొందించింది. ప్రీమియం మోడల్ గా వస్తున్న ఈ బైక్ ధరను సంస్థ రూ.6.65 లక్షలుగా నిర్ణయించింది. ఆటోమొబైల్ మార్కెట్ లో ఇప్పటికే వివిధ మోడల్స్ తో బైక్ ప్రియులను అలరిస్తున్న టూ వీలర్లకు కవాసకి గట్టిపోటీనివ్వనుంది. రేటు అధికంగా ఉన్నా కూడా సరికొత్తగా డిజైన్ లో రెట్రో లుక్స్ తో రూపొందించిన ఈ బైక్ ను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతారని ఆ సంస్థ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ బైక్ ప్రీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో వినియోగదారులకు బైక్ డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ సంస్థ ప్రకటించింది.

 ఈ బైక్ రెండు కలర్లతో అందుబాటులోకి రానుంది. Z650RS క్యాండీ ఎమరాల్డ్ గ్రీన్, మెటాలిక్ మూన్ డస్ట్ గ్రే కలర్లలో బైక్ లవర్స్ ను అలరించనుంది. గతంలో తీసుకొచ్చిన విధంగానే 649సీసీ పార్లర్ ట్విన్ ఇంజిన్ ఈ బైక్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని కవాసకి ప్రతినిధులు చెబుతున్నారు. టార్క్ విషయంలో సంస్థ ప్రతినిధులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఇంజిన్ 8000 ఆర్ పీ ఎం వద్ద 67 బీహెచ్ పీ శక్తిని పొందడంతో పాటు 6,700 ఆర్ పీఎం వద్ద 64 ఎన్ ఎంను ఉత్పత్తి చేయనుంది. ఈ బైక్ 6 స్పీడ్ గేర్ బాక్స్ తో రానుంది. ఈ ఇంజిన్ లో స్లిప్పర్ క్లచ్ ను ఏర్పాటు చేశారు. ఈ బైక్ కి వెనుక భాగంలో మోనో షాట్ సెటప్ ను అమర్చారు. ఇది 130 మీ.మీగా ఉండనుంది. అంతేగాకుండా కవాసకి జెడ్650 బైక్ 41మీ.మీ టెలిస్కోపిక్ ఫోర్కులను కలిగిఉంది. వీటితో పాటు అడ్వాన్స్ ఫీచర్లు కూడా ఈ బైక్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

సరికొత్త హంగులతో రూపొందించిన కవాసకి న్యూ మోడల్ కు బైక్ లవర్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. బైక్ రైడర్లను ఆకట్టుకునేలా ఉన్న స్పెషల్ ఫీచర్లు దీనికి ప్లస్ పాయింట్ గా మారాయి. రెట్రో లుక్స్ తో మార్కెట్ లోకి విడుదలైన కవాసకి కొత్త బైక్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే మరో రెండు నెలల పాటు వెయిట్ చూడాల్సి ఉంటుంది. స్టయిలిష్ లుక్ అండ్ స్టన్నింగ్ లుక్స్ తో రూపొందించిన ఈ బైక్ ప్రీమియం మోడల్ గా భారత విపణిలోకి అడుగుపెట్టనుంది. అయితే ఇలాంటి ప్రీమియం మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకురావడం కవాసకికి ఇదే తొలిసారి కాదు. కవాసకి VERSYS 1000 పేరుతో ఇటీవలె తీసుకొచ్చిన బైక్ ధర బహిరంగ మార్కెట్ లో రూ.11లక్షలకు పైగా పలుకుతోంది.
Tags:    

Similar News