ప్రధాని నరేంద్రమోడీ అనూహ్యంగా పాకిస్థాన్ లో పర్యటించడంపై జేడీయూ సెటైర్లు వేసింది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్ లో హఠాత్తుగా పర్యటించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. జేడీయూ సీనియర్ నాయకుడు కేసీ త్యాగి ఈవిషయంలో మోడీకి చురకలు వేశారు.
అసలు మోడీ పాక్ ఎందుకు వెళ్తున్నారు? ఇదేమీ ముందే నిర్ణయించిన కార్యక్రమం కాదు కదా...? అని త్యాగి మండిపడ్డారు. మోడీ పాక్ పర్యటనకు కారణాలేమీ కనిపించడం లేదన్నారు. బహుశా ఆయన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ బర్తడే కేక్ తినడానికి కాబూల్ లో ఆగారేమోనని వ్యంగ్యంగా అన్నారు. అలాకాకుంటే 60వ పడిలో అడుగుపెట్టబోతున్న ముంబై పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికైనా అయి ఉంటుందని వ్యాఖ్యానించారు. మోడీ అన్ని దేశాలు తిరుగుతూ దౌత్య సంబంధాలు మెంటైన్ చేయడం మంచిదేకానీ పాకిస్థాన్ వంటి దేశానికి సమయం సందర్భం లేకుండా వెళ్లడం మాత్రం పైత్యంలాగే అనిపిస్తోంది. అందుకే మోడీది దౌత్యమా ? పైత్యమా? అన్న సందేహం చాలామందిలో కలుగుతోంది.
కాగా ప్రధాని నరేంద్రమోడీ ఆఫ్ఘనిస్థాన్ నుంచి నేరుగా లాహోర్ చేరుకున్నారు. అక్కడ ప్రధాని నవాజ్ షరీఫ్ తో భేటీ అవుతారు. నవాజ్ షరీఫ్ జన్మదినం సందర్భంగా మోడీ ఈ రోజు ఉదయమే ట్విట్టర్ లో శుభాకాంక్షలు చెప్పడం విశేషం. ఇలాంటి చర్యలు మోడీ పైచేయి సాధిస్తున్నారని అనిపిస్తున్నా దాయాది దేశంతో మరీ మంచిగా వెళ్లడం కూడా మంచిది కాదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.