ఆ సీఎంకు గుర్తింపు స‌మస్య‌

Update: 2015-12-28 16:38 GMT
బీహార్‌ ఎన్నికల్లో మహాకూటమితో కలిసి ఘనవిజయం సాధించిన జనతాదళ్‌-యు (జేడీయూ) ఇపుడు కొత్త కొత్త ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటోంది. వచ్చే ఏడాది మే-జూన్‌ నెలల్లో అస్సాం - కేరళ - పుదుచ్చేరి - తమిళనాడు - పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్న నేప‌థ్యంలో రాజ‌కీయంగా ఎత్తులు సిద్ధం చేసుకుంటోంది. ఈ క్ర‌మంలో కీల‌క‌మైన రాజ్యాంగ ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టింది.

అస్సాం - పశ్చిమ బెంగాల్‌ తో సహా ఐదు రాష్ట్రాల్లో పోటీ చేయాలని జేడీయూ అగ్ర‌నేత‌లు ఇప్ప‌టికే నిర్ణయించుకున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఉన్న బాణం గుర్తు కాకుండా కొత్త ఎన్నికల చిహ్నాన్ని కేటాయించాల్సిందిగా జేడీయూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ ను కోరింది. చక్రం లేదా రావిచెట్టును చిహ్నంగా కేటాయించాలని విన్న‌వించింది. ఈ మేర‌కు కొత్త చిహ్నం కేటాయించగానే తాము ఐదు రాష్ట్రాల్లో పోటీ చేయనున్నామని రాజ్యసభ సభ్యుడు, జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు.

ఐదు నెల‌ల ముందే 5 రాష్ర్టాల పోరుకు జేడీయూ సిద్ధం అవుతోందంటే.... బీహార్ త‌ర‌హా ఫ‌లితాల‌నే మిగ‌తా చోట్ల కూడా సాధించుకోవాల‌ని నితీశ్ ఆండో కో డిసైడ్ అయిన‌ట్లున్నార‌ని ఢిల్లీ పెద్ద‌లు చ‌ర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News