తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం ఏకంగా 9 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని... ప్రజాధనాన్ని దోచేసిందని.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని సీబీఐ డైరెక్టర్ ను కలిసిన కెఏ పాల్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై ఫిర్యాదు చేశారు. సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్ ను పాల్ తన కాబోయే కోడలుతో కలిసి వెళ్లి భేటీ అయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన పాల్.. కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. "9 లక్షల కోట్ల అవినీతికి, కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతికి పాల్పడింది. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అవినీతి చూడలేదు. రాష్ట్రప్రజలంతా సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాలని కోరుతున్నారు. కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలి" అని పాల్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉందన్నారు. కేసీఆర్ సర్కార్ నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసిందని తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఎమ్మెల్సీ కవితలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని పాల్ నిప్పులు చెరిగారు.
తెలంగాణ తో పాటూ సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని పాల్ చెప్పుకొచ్చారు. "ప్రాజెక్టు అంచనా బడ్జెట్ లక్షా 5 వేల కోట్లు కాగా 35 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 75 వేల కోట్లు దోచుకున్నారు. యాదాద్రి అభివృద్ధిలోనూ అవినీతి జరిగింది. 2 వేల కోట్ల అంచనా లో 200 కోట్లు ఖర్చు చేసి అంతా దోచుకున్నారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలి. ప్రభుత్వ ఖజానాకు న్యాయం చెయ్యాలి. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల బినామీ లావాదేవీల పై కూడా విచారణ జరపాలి. " అని పాల్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు తనపై దాడులు చేస్తున్నారని పాల్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై జరిగే దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపపారు. సీబీఐతో పాటూ కేంద్రమంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాలాకు పిర్యాదు కాపీలను పంపినట్టు కెఏ పాల్ చెప్పారు.