కొందరు ముఖ్యమంత్రులు తరచూ మీడియాతో మాట్లాడుతుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు లాంటోళ్లు సీఎంలు అయితే.. పొద్దున.. మధ్యాహ్నాం.. సాయంత్రం.. అవసరమైతే రాత్రి సమయంలో ప్రెస్ మీట్లు పెట్టేయటం అలవాటు. కానీ..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కాస్త భిన్నం. ఆయన ఉత్తినే మీడియా సమావేశాల్ని ఏర్పాటు చేయటానికి వ్యతిరేకం. చాలా అవసరమైతే తప్పించి.. అస్సలు పిలవరు.
అలాంటి ఆయన వారం వ్యవధిలోనే మూడుసార్లు ప్రెస్ మీట్ పెట్టేసేంత పెద్ద నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారంటే.. థ్యాంక్స్ టు కరోనా అని చెప్పక తప్పదు. గడిచిన రెండు ప్రెస్ మీట్లలో కనిపించని కరోనా ఎఫెక్ట్.. శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్ మీట్లో మాత్రం తాజా వైరస్ ప్రభావం కొట్టొచ్చినట్లుగా కనిపించినట్లు చెప్పక తప్పదు.
ఎప్పడూ లేని రీతిలో.. మీడియా సమావేశం సందర్భంగా.. మీడియా మిత్రులకు ఏర్పాటు చేసే కుర్చీలు.. ఒక్కో రిప్టోర్టర్ కు.. రిపోర్టర్ కు మధ్య కనీసం రెండు మీటర్ల దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు చేయటం గమనార్హం. అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పే సారు.. తాను నిర్వహించే ప్రెస్ మీట్ నుంచే ఆ జాగ్రత్తల్ని తీసుకునే ప్రయత్నం చేశారని చెప్పాలి. మొత్తంగా ఇన్నాళ్లకు కరోనా ప్రభావం ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో కొట్టొచ్చినట్లు కనిపించిందని చెప్పాలి.