తెలంగాణ ముందస్తు ఎన్నికలు చరమాంకానికి వచ్చాయి. మరికొద్ది గంటలలో రాజెవరో..? పేదెవరో ? తేలనుంది. ఎన్నికల బరిలో నిలిచిన ప్రజాకూటమి, తెలంగాణ రాష్ట్ర సమితి ఎవరికి వారే విజయం తమదంటే తమదని ధీమాగా ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం ఎంతో నమ్మకంగా ఉన్నారు. తన ప్రమాణ స్వీకారానికి మూహుర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు సమాచారం. అంతే కాదు తాను తిరిగి అధికారంలోకి వస్తే ఏం చేయాలనే అంశంపై కూడా సీనియర్ నాయకులతో చర్చించినట్లు సమాచారం. గతంలో తనను విమర్శల పాలు చేసిన కొన్ని అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
ఈ పనిని తాను ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా గత తెలంగాణ రాష్ట్ర సమితి క్యాబినెట్‌లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం ఒకే ఒక్కరికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. ఇది నాలుగు సంవత్సరాలు పాటు కేసీఆర్‌ను వెంటాడింది. ప్రతిపక్షాలకు ముఖ్యంగా అన్ని పార్టీల మహిళా నాయకులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. చివరికి ఎన్నికలు ప్రచారంలో అది భాగం అయ్యింది. దీంతో ఈ సారి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపముఖ్యమంత్రి పదవి కానీ, హోం శాఖ మంత్రి వంటి కీలక పదవి కాని మహిళలకు కట్టబెట్టి తనపై మహిళల వ్యతిరేకి అని ఉన్న ముద్రను తొలగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే ఓ మహిళ చేత ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందంటున్నారు. అలాగే విద్యార్ది లోకం కూడా తనపై వ్యతిరేకంగా ఉందన్న ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు విద్యార్థి సంఘం నాయకుడు బాల్క సుమన్ శాసనసభ ఎన్నికలలో విజయం సాధిస్తే ఆయనకు కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక చంద్రబాబును తిట్టడం ద్వారా సెటిలర్ల మనోభావాలను దెబ్బ తీశారన్న అపవాదును తొలగించుకునేందుకు రాజధానిలో గెలిచిన సెటిలర్లలో ఒకరికి మంత్రి పదవి కట్టబెట్ట వచ్చు అంటున్నారు. దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని కేసీఆర్ నెరవేర్చలేదు. దీంతో ఈ విమర్శ నుంచి కూడా బయట పడేందుకు ఎక్కువ మంది దళితులకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇలా తాను ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే కీలక నిర్ణయాలతో ప్రభుత్వాన్ని ఏర్పటు చేసేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.