కేసీఆర్ తాజా ప్లాన్.. మోడీ - రాహుల్ కి చెక్

Update: 2018-05-18 11:27 GMT
తెలంగాణలో సంక్షేమ పథకాల వాన కురిపిస్తూ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.. మెల్లగా రాష్ట్రాన్ని కొడుకు కేటీఆర్ కు అప్పగించేసి జాతీయ స్థాయిలో రాణించేందుకు తదుపరి కార్యాచరణను ప్రారంభించాడు. ఇందుకు కర్ణాటకలో నెలకొన్న తాజా పరిస్థితులు కేసీఆర్ కు బలాన్ని చేకూరుస్తున్నాయి..

ఇన్నాల్లు బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ ప్రత్యమ్మాయం అని అంతా అనుకున్నారు. కేసీఆర్.. బెంగాల్ సీఎం మమతను కలిసినప్పుడు కూడా కాంగ్రెస్ తో కలిసి పోదాం అన్నదట.. కానీ కేసీఆర్ కు అది ఇష్టం లేదు. ఇప్పుడు కన్నడ నాట బీజేపీ ... కాంగ్రెస్-జేడీఎస్ ను దారుణంగా దెబ్బకొట్టాక కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి మళ్లీ చర్చ మొదలైంది..

జేడీఎస్ అధినేత కుమారస్వామి బీజేపీని జాతీయ స్థాయిలో ఎదుర్కొనేందుకు కేసీఆర్ - చంద్రబాబుల సాయం కోరారు. ఈ పరిణామం కేసీఆర్ కు వెయ్యి ఏనుగుల బూస్టప్ అందించింది. అంతేకాదు.. బీజేపీకి వ్యతిరేకంగా శివసేన కూడా గళం విప్పింది. బీజేపీ అనైతిక చర్యలపై మండిపడింది..

బీజేపీపై రోజురోజుకు ప్రాంతీయ పార్టీల్లో అసహనం పెరిగిపోతోంది. అదే సమయంలో ప్రత్యామ్మాయంగా కాంగ్రెస్ ను గుర్తించడం లేదు. ఎందుకంటే కన్నడ నాట దారుణంగా ఫ్లాప్ అయిన కాంగ్రెస్ ఏకంగా జేడీఎస్ కు మద్దతిచ్చి.. ఆ పార్టీ నేత కుమారస్వామిని సీఎం చేయాలని భావించింది. యుద్ధం చేయలేక అస్త్రసన్యానం చేసేసింది. ఇలా కాంగ్రెస్ రేపు 2019 ఎన్నికల్లో కూడా తక్కువ సీట్లు వస్తే థర్డ్ ఫ్రంట్ కు మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే ఇప్పుడు కేసీఆర్ పావులు కదుపుతున్నారు. త్వరలోనే మరోసారి ఢిల్లీలో వివిధ రాజకీయ నిపుణులు - రైతులు సంఘాలు - వ్యవసాయ రంగ నిపుణులతో సమావేశం అవ్వాలని నిర్ణయించారట.. అంతేకాదు వివిధ పార్టీలను ఫెడరల్ ఫ్రంట్ లో చేరేలా కార్యచరణ రూపొందించినట్టు తెలిసింది. ఎంతైనా జాతీయ హీరోగా వెలగాలని ఆశిస్తున్న కేసీఆర్ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి మరి..
Tags:    

Similar News